Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోటంరెడ్డి మార్క్ దూకుడు - కొత్త రికార్డు, చంద్రబాబు ప్రశంసలు..!!

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల మధ్యనే ఉండే కోటంరెడ్డి కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు సాధించలేని అరుదైన ఘనత సాధించారు. దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఒకే రోజు ప్రారంభించారు. దీంతో, కోటంరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసిస్తూ లేఖ రాసారు. నియోజకవర్గ ప్రజల్లోనూ కోటంరెడ్డి పనుల విషయంలో దూకుడుగా ఉంటూ పూర్తి చేయటాన్ని అభినందిస్తున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడో సారి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో వైసీపీలో పని చేసిన ఆయన.. 2024లో టీడీపీ నుంచి విజయం సాధించారు. కాగా,నియోజకవర్గంలో ముందస్తుగా టార్గెట్ ఫిక్స్ చేసి మరీ అనుకున్నది సాధించారు. తన నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. దీంతో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ఒకే సమయంలో 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసారు. కేవలం 60 రోజుల్లో రూ.41 కోట్లతో ఈ 339 రకాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. దీంతో, ఈ అరుదైన ఘనత సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ సీఎం చంద్రబాబు లేఖ పంపారు. దీనికికోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.

hatsoff-to-kotam-reddy-339-projects-launched-in-a-single-day-in-nellore-rural

కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన కోటంరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ప్రజలతో మమేకం అయ్యేవారు. పనులు చేయించటంలో ఆయన శైలే వేరు. వైసీపీలో ఉన్న సమయంలోనూ ప్రజా సమస్యల పైన స్పందించకపోవటంతో అధికారులను నిలదీసారు. ప్రభుత్వంలోని పెద్దలతోనూ విభేదించారు. ప్రజా సమస్యల విషయంలో దూకుడుగానే వ్యవహరించే వారు. తన నియోజకవర్గంలో ఒకే రోజులో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. అంతటితో వదల కుండా వాటిని నిరంతర పర్యవేక్షణ కోసం స్కూటీ మీద తిరుగుతూ సూచనలు చేసేవారు. తాజాగా, ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా పూర్తి చేస్తున్నారు.

చంద్రబాబు లేఖలో
ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో కోటంరెడ్డిని అభినందించారు. రూ.41 కోట్లతో నియోజక వర్గంలో 339 పనులు చేపట్టి కేవలం 60 రోజుల్లో పూర్తిచేయడం, వాటిని ప్రారంభించుకోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చినట్లుగా శంకుస్థాపన చేసి, నిర్ణీత సమయాని కి వాటిని పూర్తి చేసి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కోటంరెడ్డి పట్టుదల, చిత్తశుద్ధి అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజవకర్గంలో జరుగుతున్న రూ.232 కోట్ల విలువైన పనులు కూడా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్న కోటంరెడ్డికి అభినందనలు తెలిపారు. తనకు లేఖ ద్వారా అభినందనలు తెలిపిన చంద్రబాబుకు కోటంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+