జపాన్‌ను చూపి పిల్లల్ని కనాలన్న బాబు, నవ్వేశారు

ఏలూరు: గతంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలనేవారని కానీ, ఇప్పుడు కచ్చితంగా ఇద్దరిని కనాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు.

యువత పెరగాలంటే కొత్తతరం అవసరమన్నారు. జపాన్‌లో ఇప్పుడు అంతా వృద్ధులే ఉన్నారని, యువత లేరని చెప్పారు. యువతలో అందరికీ ఉద్యోగాలు వచ్చేలా తాను రేయింబవళ్లు కష్టపడతానన్నారు.

రానురాను జనాభా తగ్గిపోతోందని, విద్యావంతులు పెళ్లిళ్లకు దూరంగా.. ఎంజాయ్ చేద్దామని ఇంకొందరు పెళ్లికి దూరంగా ఉంటున్నారని, అందుకే జపాన్‌లో అంతా ముసలివాళ్లే అన్నారు. ఇప్పుడు పిల్లల్ని కనాల్సిన టైమొచ్చిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పిల్లల్ని కనండి.. మరింత మంది పిల్లల్ని కనండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇప్పుడు పిల్లలను కనకపోతే.. భవిష్యత్తులో సంపదను సృష్టించినా దానిని అనుభవించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పాదయాత్రకు వచ్చిన ఆయన శెట్టిపేట, తాళ్లపాలెంలలో ప్రజలనుద్దేశించి
మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

రానురాను జనాభా సంఖ్య తగ్గిపోతోందని, తాను కూడా ఒక అబ్బాయితోనే సరిపెట్టుకున్నానని, కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

జనాభా తగ్గిపోతోందని, చాలామంది ఇప్పుడు పిల్లల్ని కనడం లేదని, చదువుకున్నవాళ్లు అయితే మరీ పెళ్లిళ్లే చేసుకోవడం లేదని చంద్రబాబు అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా.. ఎందుకొచ్చిన పిల్లలు.. వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేద్దామని అనుకొని కొంతమంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తుంటే.. మరో తొమ్మిది లక్షల మంది పుడుతున్నారని, ఇంకొన్ని రోజులుపోతే చనిపోయేవారి సంఖ్య పెరుగుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

పుట్టే వారి సంఖ్య తగ్గుతుందని, అప్పుడు మన ఊళ్లో అంతా ముసలివాళ్లే కనిపిస్తారని, ఈరోజు జపాన్‌లో అదే జరిగిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆ దేశం అంతా ముసలివాళ్లేనని, దేశం దేశం పూర్తిగా చిన్న పిల్లలు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తున్నానని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

వీలయితే ఒకరిద్దరిని ఎక్కువగా పుట్టిస్తే నష్టం లేదని కానీ, అసలు పిల్లలు లేకుండా ఉండడం మంచిది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పిల్లల్ని కనాలని, అలాంటి అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. పిల్లలే లేకపోతే సమాజమే లేదని, అందరూ ముసలివాళ్లు అయిపోతారని, అప్పుడు కష్టపడలేరని వివరించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అదే జరిగితే, ఇప్పుడున్న సంపదను రెట్టింపు చేయడం సాధ్యం కాదని, ఒకవేళ సంపద పెరిగినా, దానిని వినియోగించుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అమెరికా వంటి దేశాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థతో పోలిస్తే మన వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని, ఇక్కడ పిల్లాపాపలతో అందరూ కళకళలాడడం వల్లే మెరుగైన సమాజానికి అవకాశం ఏర్పడిందని వివరించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు తన ప్రసంగంలో పిల్లల్ని కనండి అంటూ వ్యాఖ్యానించినప్పుడు ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

చంద్రబాబు

చంద్రబాబు

వారి నవ్వులను గమనించిన చంద్రబాబు.. పిల్లల్ని కనాలని తాను ఎందుకంటున్నదీ వివరించారు. భవిష్యత్తు తరం పెరగాలంటే పిల్లల్ని కనడమే మార్గమని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+