HBD CM JAGAN: ఒన్ మ్యాన్ ఆర్మీ - వై నాట్ 175 : జగన్ ఆయుధం అదే - నేటి తీర్మానం ఇదే..!!

వైఎస్ జగన్. ఒక్కడిగా మొదలై కోట్లాది మందికి అభిమాన నేతగా ఎదిగారు. ఇప్పుడు ఆ పేరే ఒక వైబ్రేషన్. తెలుగు రాజకీయాల్లో ఒక సన్సేషన్. ప్రజలతోనే నిలిచారు. ప్రజల మధ్యే ఎదిగారు. ప్రజలతోనే లీడర్ గా ఎదిగారు. ముఖ్యమంత్రి గా జగన్ నేడు నాలుగో జన్మదినం జరుపుకుంటున్నారు. కానీ, జగన్ ఈ సారి ప్రత్యేకత ఏంటంటే.. 50వ ఏట అడుగు పెట్టారు. 2009 వరకు వైఎస్ జగన్ అంటే కేవలం వైఎస్సార్ కుమారిడి గా గుర్తింపు. కానీ, 2009 తరువాత జగన్ 2019 వరకు సాగించిన పోరాటంతో ఒన్ మ్యాన్ ఆర్మీగా గుర్తింపు పొందారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో 23 స్థానాలకు పరిమితం చేసారు. ఇప్పుడు వై నాట్ 175 అంటూ మిషన్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తున్నారు. మరి..నేడు జన్మదినాన సీఎం కొత్త తీర్మానం ఏంటి...

అనుకున్నాడంటే సాధించాల్సిందే..

అనుకున్నాడంటే సాధించాల్సిందే..

వైఎస్ జగన్. తండ్రి రాజకీయంగా ఉన్న సమయంలో వ్యాపార వేత్తగా రాణించారు. వ్యాపార రంగంలోనూ సక్సెస్ అయ్యారు. 2009లో కడప ఎంపీగా గెలిచినా.. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు లేదు. కానీ, తండ్రి వైఎస్సార్ ఆకస్మిక మరణం జగన్ జీవితాన్ని ఒక్క సారిగా కుదుపుకు గురి చేసింది. అక్కడే జగన్ తన లక్ష్యం నిర్ణయించుకున్నారు. పావురాల గుట్ట వేదికగా తన ప్రయాణం స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అడ్డు పడంది. పార్టీనే వద్దనుకున్నారు. కొత్తగా పార్టీ ప్రారంభించారు. జగన్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు వెన్నంటి నిలుస్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీ కట్టబెట్టారు. వైఎస్ కుటంబానికి మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ తొలి సారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. రాజకీయ సీనియర్లంతా ఒక వైపు.. వైఎస్ కుటుంబం మరో వైపు. ఎలాంటి పొత్తులు లేవు. ధైర్యంగా వారిని తొలి ఎన్నికల్లోనే ఢీ కొట్టారు. కేవలం 1.95 శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు పరిమితం కావాల్సి వచ్చింది. నాడే చెప్పారు. దెబ్బ కొట్టారు. దెబ్బ తీసుకుంటున్నా. దెబ్బ కొడతా. అంతే, ప్రతిపక్ష నేతగా జగన్ ముందుకే వెళ్లారు, 2019 ఎన్నికల నాటికి రాజకీయంగా రాటు తేలారు. చంద్రబాబు మూలాలను లక్ష్యంగా చేసుకున్నారు.

జగన్ ను మార్చేసిన పాదయాత్ర...

జగన్ ను మార్చేసిన పాదయాత్ర...


ప్రతిపక్ష నేతగా జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసారు. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర మొత్తంగా జగన్ ను మార్చేసింది. రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లింది. పాదయాత్రలో తన లక్ష్యం ప్రజల ముందుంచారు. ప్రజలకు తాను ఏం చేసేదీ వివరించారు. ప్రజలను మద్దతుగా నిలవాలని అభ్యర్దించారు. వైఎస్సార్ అందించిన విశ్వసనీయత వారసత్వాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. పేదలకు ఏం చేస్తానో వివరించారు. ప్రజలు నమ్మారు. ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చి మూడున్నారేళ్ల పాలన పూర్తయింది. ఎన్నికల మేనిఫెస్టో 97 శాతం అమలు చేసామని చెబుతున్నారు. పాలనలో పూర్తిగా గ్రామ స్థాయిలో సంస్కరణలకే ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పిన ప్రతీ పథకం అమలు చేస్తున్నారు. సంక్షేమమే ఆయుధంగా పాలన సాగిస్తున్నారు. రాజకీయంగానూ స్థానిక సంస్థల ఎన్నికల్లో - ఉప ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించారు. గ్రామ సచివాలయ - వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు పాలన దగ్గర చేసారు. పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కరోనా రెండేళ్లు అతలాకుతలం చేసినా.. ఆర్దిక వ్యవస్థ కష్టంగా మారిన హామీల అమలులో మాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రతిపక్షాలు పొత్తుల దిశగా వెళ్తున్నా..తాను ఒంటరి పోరాటమే చేస్తానని ధైర్యంగా ప్రకటించారు. అక్కడే అభిమానులు ఫిదా అవుతున్నారు.

అదే ఆయుధం గా- అక్కడే అందరూ ఫిదా

అదే ఆయుధం గా- అక్కడే అందరూ ఫిదా

ఇక, ఇప్పుడు ఆపరేషన్ 2024 లో భాగంగా వై నాట్ 175 ఆత్మవిశ్వాస నినాదంతో జగన్ ముందుకు కదులుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మూలాల పైనే గురి పెట్టారు. చంద్రబాబు విశ్వసనీయత. .చంద్రబాబు పోటీ చేసే కుప్పం నియోజకవర్గం.. చంద్రబాబును గతంలో మద్దతుగా నిలిచిన వర్గాలపై ఫోకస్ పెట్టారు. 2019లో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ కు కొన్ని మెరుగులు దిద్ది.. మరింత పక్కాగా 2024 ఎన్నికల్లో అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకున్నారు. తాను మంచి చేసానని నమ్మితేనే ఓటు వేయండని బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. 87 శాతం మంది సంక్షేమ పథకాల లబ్దిదారులుగా ఉన్నారు. వారికి మేలు జరిగిందని..వారంతా తనకు అండగా నిలుస్తారని జగన్ విశ్వసిస్తున్నారు. తనకు మరింతగా సేవ చేయటానికి అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. అదే తన జన్మదిన తీర్మానంగా కనిపిస్తోంది. ఇక, రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ తన జన్మదినాన విద్యార్దుల మధ్యకు వెళ్తున్నారు. వారికి ట్యాబ్ లు అందిస్తున్నారు. పార్టీ నేతలు..ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+