హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూకేటాయింపు: రాజకీయ పార్టీలకు హైకోర్టు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

HC issue notices to political parties
హైదరాబాద్: భూకేటాయింపులపై వివరణ ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడురులో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాంగ్రెసు పార్టీ కార్యాలయం కోసం నాలుగున్నర లక్షలకే కేటాయించారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది.

ఈ నేపథ్యంలో హైకోర్టు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఆయా పార్టీల అధ్యక్షులను, ప్రభుత్వాలని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం భూకేటాయింపులు ఎలా జరిపారు? ఏ పార్టీ ఎంత ధరను చెల్లించింది? ఎంత భూమిని కేటాయించారు? ఎక్కడ, ఎంతకు కేటాయించారు? తదితర వివరాలను పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్ర అధ్యక్షులకు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథఅయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా హాజరయ్యారు.

శ్రీధర్ బాబుకు నోటీసులు

మంత్రి శ్రీధర్ బాబుకు హైకోర్టు మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా ఓయూ ఐకాస నేత శ్రీరాం నిర్బంధం కేసులో మంత్రికి నోటీసులు జారీ అయ్యాయి. గతంలో శ్రీధర్ బాబు అనుచరులు ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారంటూ శ్రీరాం కరపత్రాలు పంచినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఆగ్రహంచి కొందరు శ్రీరాంపై దాడి చేశారు. తాజాగా ఓ కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు.

శ్రీధర్ బాబు అనుచరులు తన భర్తను తప్పుడు కేసులో ఇరికించారంటూ శ్రీరాం భార్య హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ చేసే ప్రమాదముందని ఆమె ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శ్రీధర్ బాబు సహా, కరీంనగర్ పోలీసులకు నోటీసులు అందజేసింది. శ్రీరాంను సంకెళ్లతో నిమ్స్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాంను వెంటనే నిమ్స్ ఆస్పత్రి నుంచి చంచల్‌గూడా జైలుకు తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

English summary
The Andhra Pradesh High Court on Tuesday issued notices to state government and political parties over land allocation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X