పార్టీ ఎందుకు మారానో చెప్తా, జగన్ వద్దకు వెళ్లినప్పుడు..: సుజయ
తనకు నోటీసులు రావడంపై ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు బుధవారం స్పందించారు. ఫిరాయింపులకు సంబంధించి తనకు నోటీసులు అందిన తర్వాత మాట్లాడుతానని తెలిపారు.
విజయనగరం: తనకు నోటీసులు రావడంపై ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు బుధవారం స్పందించారు.
ఫిరాయింపులకు సంబంధించి తనకు నోటీసులు అందిన తర్వాత మాట్లాడుతానని తెలిపారు. అలాగే, తాను పార్టీ ఎందుకు మారారనే విషయంపై సమయాన్ని బట్టి స్పందిస్తానన్నారు.

అప్పుడు రాజీనామా ఆమోదించలేదు
తాను గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లినప్పుడు రాజీనామా చేసినా, ఆనాడు ఆమోదించలేదని సుజయ కృష్ణ రంగారావు చెప్పారు.
Recommended Video


మంత్రి పదవి చేపట్టాక ప్రశ్నిస్తున్నారు
తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇప్పుడు పార్టీ మారడం గురించి ప్రశ్నిస్తున్నారని సుజయ అన్నారు. తాను నైతికతకు ఎక్కువగా విలువ ఇచ్చే వ్యక్తినని చెప్పారు. పార్టీ మారిన విషయాన్ని నైతికంగా చూడాలని చెప్పారు.

నలుగురితో పాటు ప్రధాన కార్యదర్శికి..
వైసిపిని వీడి టిడిపిలో చేరిన నలుగురు మంత్రులతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

నోటీసులు వీరికే..
కోర్టు నోటీసులు అందిన వారిలో మంత్రులు అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు ఉన్నారు. వీరికి నోటీసులు పంపించారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications