టీచర్‌కు వేధింపు: టీచర్స్ డే రోజే హెడ్మాస్టర్ దేహశుద్ది
హైదరాబాద్: ఉపాధ్యాయుల దినోత్సవం నాడే ఓ గురువును చితకబాదారు. తోటి మహిళా టీచర్‌ను వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో ఓ హెడ్మాస్టర్‌ను చితకబాదారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో జరిగింది. హెడ్మాస్టర్‌కు పలువురు దేహశుద్ధి చేశారు.

విజయవాడలో మహిళ దారుణ హత్య
విజయవాడ నగరంలోని కృష్ణలంక హైస్కూల్ సమీపంలో 50 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. దుండుగులు మహిళ గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
విశాఖలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
విశాఖపట్నం నగరంలోని పైప్‌లైన్ జంక్షన్ వద్ద శుక్రవారం ఓ గ్యాస్ ట్యాంక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


Click it and Unblock the Notifications