వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం..!!

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.

ఇదే కేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 25 వరకు అంటే ఇవ్వాళ్టి వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ ముందస్తు బెయిల్ పిటీషన్‌ గడువు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠత ఏర్పడింది.

 vivekcbi

దీనితో మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్లు- ఇవ్వాళ మరోసారి తెలంగాణ హైకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ 18వ తేదీన ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కనబెట్టిన నేపథ్యంలో- ప్రస్తుతం అందరి దృష్టీ తెలంగాణ హైకోర్టు మీదే నిలిచింది. హైకోర్టు తీర్పు తరువాత సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

వివేకా హత్య కేసుల విషయంలో సీబీఐ ఇప్పటికే అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. ఆయన తరపు న్యాయవాది వాదనలు ఇదివరకే ఆలకించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి జమ్మలమడుగుకు బయలుదేరి వెళ్లిన సమయంలో వైఎస్ వివేకా హత్య చోటు చేసుకున్నట్లు అవినాష్ రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందిందని, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయనకు ఈ సమాచారం ఇచ్చారని అన్నారు.

హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అభియోగాలు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఇవ్వాళ ఆదేశాలను వెలువడించే అవకాశం ఉంది. ఈ కేసుపై హైకోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో- నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసుపై విచారణలను జూన్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుపై దర్యాప్తును జూన్ 30వ తేదీలోగా పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఇదివరకే సీబీఐని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+