వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

(పిక్చర్స్) నెత్తిపై చున్నీ, ముఖంపై కర్చీఫ్: బీర్ తాగొద్దని సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు యావత్ దేశాన్ని ఎండలు కకలావికలం చేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత కనిపిస్తోంది. దీంతో వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోయారు. బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ రోజు, రేపు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మధ్యాహ్న సమయంలో ఎండల్లో తిరగరాదని హెచ్చరించింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పొడి, వేడిగాలుల ఉద్ధృతి మరింత పెరగనుంది.

మంగళవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో పలు చోట్ల గరిష్ఠంగా 42 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో జల్లులు పడే అవకాశాలూ ఉన్నాయి.

ఎండలు

ఎండలు

నేడు, రేపు తెలంగాణ, రాయలసీమల్లో గరిష్గ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మధ్యాహ్నం ఎండలో తిరగరాదని హెచ్చరించింది.

ఎండలు

ఎండలు

ఎండవేడి తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ముఖానికి దస్తీ, నెత్తిన టోపీ పెట్టుకొని వెళ్తున్న ఓ ద్విచక్రవాహన చోదకుడు.

ఎండలు

ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఎండవేడికి నెత్తిన చున్ని కప్పుకొని వెళ్తున్న ఓ యువతి. ఈ ఏడాది రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే.

ఎండలు

ఎండలు

ఎండవేడిమి తట్టుకోలేక ముఖానికి నిండుగా స్కార్ఫ్ కప్పుకొని స్కూటీ పైన వెళ్తున్న ఓ మహిళ. సాగర తీరమైన విశాఖలోను వేడికి ప్రజలు అల్లాడుతున్నారు.

ఎండలు

ఎండలు

ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లని బీరును ఆశ్రయిస్తుంటారని, అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎండలు

ఎండలు

ఆరోగ్యానికి హాని చేయడంతోపాటు వేసవిలో బీర్లు ఎక్కువగా తాగడం వల్ల తొందరగా డీహైడ్రేషన్‌ బారిన పడే ముప్పు ఉందంటున్నారు.

ఎండలు

ఎండలు

బుధవారం, గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వడగాల్పుల ప్రభావం మరింత ఉధృతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఎండలు

ఎండలు

దాహం వేస్తే మంచినీళ్లు లేదంటే ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం మంచిది. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఇవి కాపాడతాయి.

ఎండలు

ఎండలు

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు యావత్ దేశాన్ని ఎండలు కకలావికలం చేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత కనిపిస్తోంది.

ఎండలు

ఎండలు

దీంతో వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోయారు. బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎండలు

ఎండలు

ఈ రోజు, రేపు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మధ్యాహ్న సమయంలో ఎండల్లో తిరగరాదని హెచ్చరించింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పొడి, వేడిగాలుల ఉద్ధృతి మరింత పెరగనుంది.

English summary
Heat wave in Telangana, Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X