చంద్రబాబు బెయిల్ పై వాడీవేడీ వాదనలు-రిమాండ్ పొడిగించి కస్టడీకి ఇమ్మంటున్న సీఐడీ..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ను పొడిగించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు నెలరోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ పై ఉన్న చంద్రబాబును మరో 15 రోజుల పాటు రిమాండ్ కు పంపాలని సీఐడీ న్యాయవాది కోరారు. దీన్ని చంద్రబాబు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.అటు చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ కస్టడీ పిటిషన్ పైనా వాదనలు కొనసాగుతున్నాయి.

స్కిల్ కేసులో చంద్రబాబు నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉందని సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు కర్త, కర్మ, క్రియ అని ఆయన వాదించారు. కాబట్టి చంద్రబాబు రిమాండ్ ను 15 రోజుల పాటు పొడిగించడంతో పాటు ఆయన్ను ఐదు రోజుల పాటు కస్టడీకి కూడా ఇవ్వాలని ఏఏజీ కోరారు. స్కిల్ కేసులో మొత్తం రూ.370 కోట్ల నిధులు పక్కదారి పట్టిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు.
స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రను నిర్ధారిచేందుకు అవసరమైన మరికొన్ని పత్రాల్ని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. స్కిల్ ట్రైనింగ్ పేరుతో రూ.370 కోట్ల నిధులు ఎలా స్వాహా చేశారన్నదీ కోర్టుకు వివరించారు. డొల్ల కంపెనీల నుంచి నిధులు ఎలా టీడీపీకి వెళ్లాయన్న దానిపై ఆధారాలు సమర్పించారు. ఇందులో రూ.27 కోట్ల నిధుల మళ్లింపుపై ఆధారాలు ఇచ్చారు. దీనిపై చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications