అల్పపీడనం - వాన జోరు.. పిడుగుల బీభత్సం, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ముందస్తుగానే వచ్చినా రుతుపవనాల కదలిక మందగించింది. తిరిగి ఇప్పుడు కదలిక మొదలు కావటంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవ ర్తనం ఆవరిస్తుందని, దాని ప్రభావంతో 20 తర్వాత అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో వానలు దంచి కొట్టే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
ఈ నెల 18, 19 తేదీల్లో వాయవ్య, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో 20 తర్వాత అల్పపీడనం ఏర్పడు తుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులుతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గురువారం రాత్రి 7 గంటల వరకు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో 64 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 61.7, కాకాణిలో 55, చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో 54 మిల్లీమీటర్ల వాన పడింది. నేడు (జూన్ 13) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు శుక్రవారం (జూన్ 13) తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 37 డిగ్రీలు, మహబూబ్ నగర్లో కనిష్టంగా 27.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications