వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

క్షణం గ్యాప్ ఇవ్వకుండా కుండపోతలా కురుస్తోన్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తడిసిముద్దయింది. రాష్ట్రం నలుమూలా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. బుధవారం మధ్యాహ్నానికి మరణాల సంఖ్య 10కి చేరింది. దాదాపు విపత్తును తలపించే పరిస్థితుల మధ్య జనం బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం వివిధ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కీలక ఆదేశాలు, సూచనలు చేశారు.

జస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలుజస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

 తెలంగాణ ఎఫెక్ట్..

తెలంగాణ ఎఫెక్ట్..

నిజానికి ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం నిన్ననే(మంగళవారమే) తీరం దాటింది కాబట్టి పెను ప్రమాదం, తీవ్ర ఇబ్బంది ఉండకపోవచ్చని, అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆ ప్రభావానికి వరద పోటెత్తుతున్నదని, ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతోందని సీఎం జగన్ అన్నారు. భారీ వర్షాలు, వరదల సంద్భంలో ఆయా జిల్లాల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలను అడిగితెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏయే అంశాలకు ప్రయారిటీ ఇవ్వాలో స్పష్టతనిచ్చారు..

 ఫస్ట్ ప్రయారిటీ వీటికే..

ఫస్ట్ ప్రయారిటీ వీటికే..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. వరద బాధితులకు సహాయం, విద్యుత్‌ పునరుద్ధరణకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, ఆ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాత రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టాలని, అదేసమయంలో వర్షాలు, వరదల వల్ల వచ్చే వ్యాధులు, ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని జగన్ చెప్పారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని, రాష్ట్రమంతటా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. మంచినీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, వ్యాధుల ప్రబలకుండా తగిన జాగ్రత్తులు తీసుకోవాలని, ఆ మేరకు అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, వరదలు తగ్గాక పాము కాట్లకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వారం రోజుల్లో ముగించాలి..

వారం రోజుల్లో ముగించాలి..

తెలంగాణ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నామని, మరో 24 గంటల పాటు వర్షం, వరద ప్రభావం ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ప్రకాశం బ్యారేజీలోకి భారీగా నీరు వస్తుండటంతో గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. వేర్వేరు జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. గతంలో మాదిరి ఆలస్యం చేయకుండా, ఈసారి పంట నష్టం అంచనాలను వారం రోజుల్లో సిద్దం చేసి పంపాలని కలెక్టను ఆదేశించారు.

 చిత్తూరులో విచిత్ర పరిస్థితి..

చిత్తూరులో విచిత్ర పరిస్థితి..

రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతూ, ఎక్కడికక్కడ చెరువులు పొంగపొర్లుతున్నప్పటకీ చిత్తూరు జిల్లాలో విచిత్ర పరిస్థితులు నెలకొని ఉండటంపై సీఎం జగన్ విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈసారి 40 శాతం అధిక వర్షం కురిసినప్పటికీ కేవలం 30 శాతం చెరువులు మాత్రమే పూర్తిగా నిండటం పరిస్థితికి అద్దం పడుతున్నదని, దీన్ని పూర్తిగా మార్చాలని, కురిసే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టడం, తద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. తద్వారా కరువు నివారణలో శాశ్వత పరిష్కారం చూడాలని సీఎం అధికారులతో అన్నారు. ఇతర జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువుల విషయంలోనూ అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టాలని సీఎం అన్నారు.

జడ్జిలపై జగన్ ఫిర్యాదు: నారా లోకేశ్ తీవ్ర స్పందన - 'ఆంధ్ర ఎస్కోబార్' అంటూ టీడీపీ ఫైర్జడ్జిలపై జగన్ ఫిర్యాదు: నారా లోకేశ్ తీవ్ర స్పందన - 'ఆంధ్ర ఎస్కోబార్' అంటూ టీడీపీ ఫైర్

Recommended Video

#Floods: Heavy Rains - Water Logging in Hyderabad భారీ వర్షం.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

English summary
amid heavy rains and flood like situation in andhra pradesh, Chief Minister ys Jagan conducted a review with districts collectors and SPs on wednesday. CM directed the officers to remain vigilant at the field level. It was suggested that roads and electricity be restored on a war footing. He said the authorities should also focus on diseases caused by rain. around 10 people died in ap due to rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X