కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పలు గ్రామాలు జలమయం, పొంగుతున్న వాగులు
కర్నూలు: జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో రహదారులపై నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Recommended Video
కర్నూలు జిల్లాలోని కోడుమూరు, కౌతాళం, ఆదోనీ, కోసిగి, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, నందవరం, ఆస్పరి, బండి, ఆత్మకూరు, నంద్యాల, సున్నిపెంట, పత్తికొండ, సి బెలగల్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నందవరం మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ, కోడుమూరు పట్టణంలోని పలు ప్రాంతాలు వరద నీరు ప్రవేశించింది.

నందవరం మండలం పెద్దకొత్తిలో వాగు ఉధృతికి పంట పొలాలు నీటి మునిగిపోయాయి. కోడుమూరు మండలం పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా కర్నూలు-ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగులో చిక్కుకున్న హెచ్‌పీ గ్యాస్ లారీ డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు.
కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు వరదనీటితో నిండిపోవడంతో ప్రజలకు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాయలం రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరుకుంది.
కాగా, నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications