Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పలు గ్రామాలు జలమయం, పొంగుతున్న వాగులు

కర్నూలు: జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో రహదారులపై నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Recommended Video

    AP & TS Rains |Weather Forecast| Floods | Oneindia Telugu

    కర్నూలు జిల్లాలోని కోడుమూరు, కౌతాళం, ఆదోనీ, కోసిగి, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, నందవరం, ఆస్పరి, బండి, ఆత్మకూరు, నంద్యాల, సున్నిపెంట, పత్తికొండ, సి బెలగల్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నందవరం మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ, కోడుమూరు పట్టణంలోని పలు ప్రాంతాలు వరద నీరు ప్రవేశించింది.

    Heavy rains in Kurnool district: some villages in flood water

    నందవరం మండలం పెద్దకొత్తిలో వాగు ఉధృతికి పంట పొలాలు నీటి మునిగిపోయాయి. కోడుమూరు మండలం పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా కర్నూలు-ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగులో చిక్కుకున్న హెచ్‌పీ గ్యాస్ లారీ డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు.

    కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు వరదనీటితో నిండిపోవడంతో ప్రజలకు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాయలం రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరుకుంది.

    కాగా, నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలో ప్రవేశించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+