వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణల్లో ఉగ్ర గోదావరి తగ్గుముఖం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇప్పటికే వరదనీటితో అనేక గ్రామాలు నీట చిక్కుకోగా ఇప్పుడు పోలవరం, కోనసీమ లంక గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉంది. అటు భద్రాచలం మన్యమూ వరదముప్పుతో సతమతమవుతోంది. గంటగంటకూ పెరుగుతున్న నదీప్రవాహం ఇటు ప్రజలను, అటు అధికారులను నిద్రలేకుండా చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలు తగ్గినప్పటికీ ఒడిశాలో కురుస్తూండటంతో శబరి నది ఉరకలెత్తుతోంది. ఫలితంగా ఖమ్మం జిల్లాలో గోదావరికి వరదనీరు పోటెత్తుతోంది. దీనితో రాజమండ్రివద్ద అఖండ గోదావరికి అడ్డూఅదుపూలేకుండా వరదనీరు భారీగా చేరుతోంది. భద్రాచలంవద్ద గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 56 అడుగులకు చేరుకోగా చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోకి నీరుచేరకుండా మోటార్లతో నీటిని తోడి మళ్లీ గోదావరిలోకే పంపింగ్ చేస్తున్నారు.

ఇప్పటి పరిస్తితి ఇలాగే కొనసాగుతుందని, ఈ రాత్రికి నీటిమట్టం 60 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, మంగళవారం ఉదయం నాటికి ఉధృతి తగ్గింది. మన్యం పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వందలాది ఎకరాల్లో పత్తి, మిర్చి పంట నీటిపాలైంది. నీటిలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలను ప్రత్యేకలాంచీలలో తరలిస్తున్నారు. భద్రాచలం, ఖమ్మం, రంపచోడవరం అధికారులు కలసికట్టుగా సహాయకచర్యలు చేపట్టారు.

గోదావరి

గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 56 అడుగులకు చేరుకోగా చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోకి నీరుచేరకుండా మోటార్లతో నీటిని తోడి మళ్లీ గోదావరిలోకే పంపింగ్ చేస్తున్నారు.

కడెం ప్రాజెక్టు

కడెం ప్రాజెక్టు

భారీ వర్షాల కారణంగా అదిలాబాద్ జిల్లా కడెం గేటు ప్రాజెక్టు పొంగిపొర్లుతున్న దృశ్యం. మంగళవారం ఉదయం నాటికి ఉధృతి తగ్గింది.

వర్షం

వర్షం

గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇప్పటికే వరదనీటితో అనేక గ్రామాలు నీట చిక్కుకోగా ఇప్పుడు పోలవరం, కోనసీమ లంక గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉంది.

వర్షం

వర్షం

అటు భద్రాచలం మన్యమూ వరదముప్పుతో సతమతమవుతోంది. గంటగంటకూ పెరుగుతున్న నదీప్రవాహం ఇటు ప్రజలను, అటు అధికారులను నిద్రలేకుండా చేస్తోంది.

మరోవైపు పశ్ఛిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కడెమ్మ, కోండ్రుకోట, కొత్తూరు కాజ్‌వేలపై నుంచి ఐదారు అడుగుల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని నందీశ్వర ఆలయం జలమయమైంది. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రమూ నీటచిక్కుకుపోయింది. అచంట, యలమంచిలి మండలాల్లో లంక గ్రామాలు, కరకట్టల పరిస్థితిని అధికారులు పరిశీలించారు.

సోమవారం సాయంత్రానికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీవద్ద గోదావరి నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాదాపు 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఇది కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తనుండటంతో భీతావహులవుతున్నారు. బ్యారేజివద్ద నీటిమట్టం 15 అడుగలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

English summary
Heavy rains trigger flood alert in Telangana and AP villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X