బాలయ్య గ్రీటింగ్స్: వైజాగ్ రైల్వేస్టేషన్ కిటకిట(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింభించే సంక్రాంతి పండుగ, తెలుగింట సంతోషాలు నింపాలని హిందూపురం శాసన సభ్యుడు, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ మంగళవారం అన్నారు. నిమ్మకూరులో బాలకృష్ణ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత వ్యసనాలు పారద్రోలి, కొత్త జీవితాన్ని ప్రారంభించి నూతన క్రాంతివైపు ప్రతిఒక్కరూ పయనించాలన్నారు.
మరోవైపు, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు పల్లె బాట పట్టారు. హైదరాబాద్, విశాఖలలో ఉంటున్న ప్రజలు తమ తమ ఊళ్లకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.

సంక్రాంతి సంబరం
పాఠశాలలు, కళాశాలకు కూడా సెలవులు రావడటంతో కుటుంబ సమేతంగా నగరాల్లో ఉన్న ప్రజలు పల్లెలకు వెళ్తున్నారు.

సంక్రాంతి సంబరం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇసుకేస్తే రాలనంత జన సంద్రంగా కనిపిస్తున్నాయి.

సంక్రాంతి సంబరం
బస్సులతో పోల్చితే రైలు చార్జీలు తక్కువగా ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎక్కువగా రైళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

సంక్రాంతి సంబరం
దీంతో రైళ్లకు మరింత డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే ఎప్పటిలానే ప్రయాణికుల అవసరాలకు అవి ఎంత మాత్రం సరిపోవడం లేదు.

సంక్రాంతి సంబరం
ప్రత్యేక రైళ్లలో నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి సంబరం
దీంతో దొరకని ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. పండగకి సొంత ఊర్లకు వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.

సంక్రాంతి సంబరం
బస్సులు, రైళ్లు ఇలా ఫ్లాట్ ఫామ్ మీదకి వచ్చి రాగానే నిండిపోతున్నాయి. ఎన్ని బస్సులు ఏర్పాటు చేసినా అవి ప్రయాణికుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి.












Click it and Unblock the Notifications