జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉంది: రొట్టె అందుకున్న ఎమ్మెల్యే
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక రొట్టెను అందుకున్నారు.
సోమవారం బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకొన్న అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.

రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. చిన్నలు, పెద్దలు, మహిళలు అందరు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications