టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ: రూ.50లక్షల నగదు, బంగారు, వజ్రాభరణాల అపహరణ

Subscribe to Oneindia Telugu

తూర్పుగోదావరి: జిల్లాలోని మండపేటలో భారీ చోరీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యకుడు వల్లూరి సాయికుమార్‌ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు ప్రవేశించి రూ.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, రూ.50వేల నగదును దోచుకెళ్లారు.

ఘటనపై సమాచారం అందుకున్న రామచంద్రాపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌ స్వ్కాడ్, క్లూస్‌ టీంలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

heavy theft in TDP leader's house

మంగళగిరిలో పార్టీ కార్యాలయం

అమరావతి: మంగళగిరి దగ్గర పార్టీ కార్యాలయం ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పార్టీ సమన్వయ కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పార్టీ కార్యాలయం గుంటూరులో ఉండటం వల్ల ఇబ్బందిగా ఉందని చెప్పారు

రాజధానికి దగ్గరలో పార్టీ కార్యాలయం ఉండాలని పార్టీ నాయకులు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సూచించారు. పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి లోకేశ్ సమన్వయ కమిటీ ముందుంచారు. కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు లోకేశ్‌కు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy theft in TDP leader's house in East Godavari district on Tuesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి