• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో మరో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు: రాత్రి నుంచి ఏకధాటిగా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు.. రాయలసీమను అతలాకుతలం చేశాయి. చిత్తూరు, కడప, అనంతపురంలతో పాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లా నెల్లూరును ముంచెత్తాయి. రాయలసీమ జిల్లాలు నిండా మునిగాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే పెన్నా, పాపాఘ్ని, కుందూ, చెయ్యేరు, చిత్రావతి.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా ఉగ్రరూపాన్ని దాల్చాయి. ఆయా నదుల తీర ప్రాంతాలన్నీ వరదముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు ఇప్పటిదాకా 24 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

రాయలసీమ, ఏపీ దక్షిణ కోస్తాపై ప్రభావం..

రాయలసీమ, ఏపీ దక్షిణ కోస్తాపై ప్రభావం..

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగింది. మైలవరం రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు జల వనరుల శాఖ అధికారులు. అతి భారీ వర్షాలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల గిరుల్లో ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ వరదపోటుకు గురయ్యాయి. కపిలతీర్థం, మాల్వాడిగుండం, పాపనాశనం.. ఇవన్నీ ఉప్పొంగాయి. వరద నీరంతా తిరుపతి నగర వీధుల్లోకి ప్రవహించింది. తిరుమల తిరుపతి జలమయం అయ్యాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. అలిపిరి నడకదారి మొత్తం ధ్వంసమైంది.

మళ్లీ వర్షాలు..

మళ్లీ వర్షాలు..

చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాలు ఇంకా వరదముంపులోనే ఉన్నాయి. శనివారం వర్షం కొద్దిగా తెరపినిచ్చినప్పటికీ.. రాత్రి మళ్లీ మొదలైంది. కడపలో ఒక్కసారిగా ఉరుముల, మెరుపులతో భారీ వర్షం పడింది. తిరుపతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి, నెల్లూరుతో పాటు జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, విద్యానగర్ వంటి చోట్ల మళ్లీ వర్షం కురిసింది. ఫలితంగా- లోతట్టు ప్రాంతాల ముంపు తీవ్రత మరింత పెరిగింది.

ఇక కోస్తా జిల్లాలపై

ఇక కోస్తా జిల్లాలపై

ఇక ఈ వర్షాల తీవ్రత కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. వచ్చే 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. ఒంగోలు, పర్చూరు, కనిగిరి, చీరాల వంటి చోట్ల మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది.

గుంటూరు, కృష్ణాల్లో..

గుంటూరు, కృష్ణాల్లో..

గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఇదే పరిస్థితులు ఏర్పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. గుంటూరు తీర ప్రాంత జిల్లాలు, కృష్ణాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం నిపుణులు సూచిస్తోన్నారు. లోతట్టు ప్రాంతాల నివాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. కృష్ణానదికి వరద వచ్చే భయం లేదని, అయినప్పటికీ.. భారీ వర్షాల తీవ్రత వల్ల కొన్ని చోట్ల జనావాసాల్లోకి నీరు ప్రవహించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

English summary
Heavy to Very heavy rainfall in Coastal districts such as Prakasam, Guntur and Krishna districts of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X