ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో పల్నాడు నయగారా!
గుంటూరు: భారీ వర్షాల కారణంగా ఆంధ్రా - తెలంగాణ సరిహద్దుల్లోని పల్నాడు ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతం ఎత్తిపోతల జలపాతం. ఈ పర్యాటక కేంద్రం ప్రస్తుతం నయగారా జలపాతాన్ని తలపిస్తోంది. గత రెండేళ్లుగా నీరు లేక ఈ జలపాతం వెలవెలపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పుడు భారీగా నీరు చేరుతోంది. దీంతో ఈ జలపాతం పర్యాటకులను ఇప్పుడు కనువిందు చేస్తోంది. గతంలో ఇక్కడ నీళ్లు ప్రవహించినప్పుడు సినిమా షూటింగులు జరిగేవి. కానీ ఇటీవల నీళ్లు లేక షూటింగులు జరగలేదు. ఇప్పుడు మళ్లీ షూటింగులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications