ఢిల్లీలో ఈదురుగాలులు: కుప్పకూలిన వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం, కొనసాగుతున్న దీక్ష

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున ఈదురు గాలులు చోటు చేసుకోవడంతో వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. అయితే ఏపీ భవన్ ప్రాంగణం లోపలే వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తున్నారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన తర్వాత వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ వేదికగా శుక్రవారం నాడు ఆమరణ దీక్షకు దిగారు. అయితే శుక్రవారం సాయంత్ర ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు చోటు చేసుకోవడంతో వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. టెంట్లు లేచిపోయాయి.

heavy winds in New Delhi,destroyed ysrcp deeksha premises

దీంతో దీక్షా శిబిరం నుండి వైసీపీ ఎంపీలు లేచి ఏపీ భవన్ ప్రాంగంణం లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్ష శిబిరం వద్ద ఉన్న పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మీడియా సిబ్బంది కూడ ఈదురుగాలులతో సురక్షిత ప్రాంతాలకు చేరుకొన్నారు. తమ నిరహర దీక్షలను కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+