నగరవీధుల్లో కెసిఆర్: ఐడిహెచ్‌కాలనీకి వరాలు(పిక్చర్స్)
హైదరాబాద్: పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. నిరుపేదలు గౌరవంగా బతికేలా వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు నిర్మిస్తామని, హైదరాబాద్ నగరంలో పేదల బస్తీల్లో ఆనందం నింపుతామని అన్నారు. సోమవారం సాయంత్రం సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బోయిగూడ ఐడిహెచ్ కాలనీని కెసిఆర్ సందర్శించారు. ఐడిహెచ్ కాలనీలో ఉన్న సమస్యలపై సోమవారం ఉదయమే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. దీనిపై స్పందించిన సిఎం అధికారులతో కలిసి సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు.
ఇరుకైన రోడ్లతో ఉన్న ఐడిహెచ్ కాలనీలో ప్రతి వీధిని ఆయన కలియ తిరిగి అక్కడి పరిస్థితిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీవాసులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. దుర్భర స్థితిలో ఉన్న వాతావరణాన్ని, రోడ్లను చూసి కెసిఆర్ చలించిపోయారు. ఐడిహెచ్ కాలనీలో బహుళ అంతస్తుల్లో ఉన్న భవనాలన్నీ శిథిలావస్థకు చేరి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని కూలిపోయి ఉండడాన్ని ఆయన వీక్షించారు. అక్కడ నివాసం ఉంటున్న వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాలతోపాటు నగరంలో పలుచోట్ల ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వారున్నారని, కాని ఇలాంటి కాలనీలను చూస్తే పేదల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. తాను పేదల పక్షాన నిలుస్తానన్నారు. ఐడిహెచ్ కాలనీలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడు వాటా ధనం చెల్లించాల్సిన అవసరం లేదని, వందశాతం ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న ఇళ్లు ఏ క్షణమైనా కూలిపోయో ప్రమాదం ఉందని, వెంటనే వాటిని ఖాళీ చేయాలని సూచించారు. ఐదు నెలల్లోనే కొత్త ఇళ్లు నిర్మిస్తామని, మంగళవారం నుంచే లేఅవుట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇతర అధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ప్రస్తుతం ఇళ్లలో నివాసం ఉంటున్న వారి వివరాలను ఫొటోలతో సహా తీసుకుంటామని, వారికే కొత్త ఇళ్లు కేటాయిస్తామన్నారు.
మహిళల పేరుపై పట్టాలిచ్చి రిజిస్ర్టేషన్ చేస్తామని వెల్లడించారు. నగరంలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం బోయిగూడ నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఇదొక మోడల్ కాలనీగా ఉంటుందని, ప్రతి కుటుంబానికి రెండు బెడ్ రూమ్‌లు, హాలు, కిచెన్‌లతో కూడిన ఇల్లు వస్తుందని భరోసా ఇచ్చారు. కాలనీలో రోడ్లు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులతో పాటు వైఫై, ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, మున్సిపల్ శాఖ కార్యదర్శి మీనా ఉన్నారు.

కెసిఆర్
పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు.

కెసిఆర్
నిరుపేదలు గౌరవంగా బతికేలా వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు నిర్మిస్తామని, హైదరాబాద్ నగరంలో పేదల బస్తీల్లో ఆనందం నింపుతామని అన్నారు.

కెసిఆర్
సోమవారం సాయంత్రం సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బోయిగూడ ఐడిహెచ్ కాలనీని కెసిఆర్ సందర్శించారు.

కెసిఆర్
ఐడిహెచ్ కాలనీలో ఉన్న సమస్యలపై సోమవారం ఉదయమే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిని కలిసి వివరించారు.

కెసిఆర్
దీనిపై స్పందించిన సిఎం కెసిఆర్ అధికారులతో కలిసి సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు.

కెసిఆర్
ఇరుకైన రోడ్లతో ఉన్న ఐడిహెచ్ కాలనీలో ప్రతి వీధిని ఆయన కలియ తిరిగి అక్కడి పరిస్థితిని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కెసిఆర్
బస్తీవాసులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. దుర్భర స్థితిలో ఉన్న వాతావరణాన్ని, రోడ్లను చూసి కెసిఆర్ చలించిపోయారు.

కెసిఆర్
ఐడిహెచ్ కాలనీలో బహుళ అంతస్తుల్లో ఉన్న భవనాలన్నీ శిథిలావస్థకు చేరి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని కూలిపోయి ఉండడాన్ని ఆయన వీక్షించారు. అక్కడ నివాసం ఉంటున్న వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

కెసిఆర్
ఇప్పుడున్న ఇళ్లు ఏ క్షణమైనా కూలిపోయో ప్రమాదం ఉందని, వెంటనే వాటిని ఖాళీ చేయాలని సూచించారు.

కెసిఆర్
ఐదు నెలల్లోనే కొత్త ఇళ్లు నిర్మిస్తామని, మంగళవారం నుంచే లేఅవుట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

కెసిఆర్
స్థానిక ఎమ్మెల్యే, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇతర అధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.

కెసిఆర్
ప్రస్తుతం ఇళ్లలో నివాసం ఉంటున్న వారి వివరాలను ఫొటోలతో సహా తీసుకుంటామని, వారికే కొత్త ఇళ్లు కేటాయిస్తామన్నారు.

కెసిఆర్
మహిళల పేరుపై పట్టాలిచ్చి రిజిస్ర్టేషన్ చేస్తామని వెల్లడించారు. నగరంలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం బోయిగూడ నుంచే ప్రారంభమవుతుందన్నారు.

కెసిఆర్
ఇదొక మోడల్ కాలనీగా ఉంటుందని, ప్రతి కుటుంబానికి రెండు బెడ్ రూమ్‌లు, హాలు, కిచెన్‌లతో కూడిన ఇల్లు వస్తుందని భరోసా ఇచ్చారు.

కెసిఆర్
కాలనీలో రోడ్లు, విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులతో పాటు వైఫై, ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు.

కెసిఆర్
ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, మున్సిపల్ శాఖ కార్యదర్శి మీనా ఉన్నారు.












Click it and Unblock the Notifications