Pawan Kalyan : 34-26-5- గోదావరిలో పవన్ ధీమాకు కారణం ఈ లెక్కలేనా ?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాల్ని కూడగడుతూ, మరోవైపు తాను స్వయంగా జనసేనను ముందుకు నడిపిస్తూ వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కు తాజాగా తన వ్యూహాలు పరోక్షంగా బయటపెడుతున్నారు. గోదావరి జిల్లాల నుంచే తాను వారాహి యాత్ర ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్.. నిన్న మలికిపురం సభలో ఈ ప్రాంతంలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలనే పిలుపునిచ్చారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
గోదావరి జిల్లాల నుంచి వారాహి యాత్ర ప్రారంభించడమే కాకుండా ఈ జిల్లాల్లో వైసీపీకి 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా చేయాలనే పవన్ పిలుపు వెనుక ఉన్న ధీమా ఇప్పుడు జనసేన నేతలతో పాటు టీడీపీ, బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. అలాగే పవన్ ధీమా వెనుక గల కారణాలపైనా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై పవన్ ధీమా వెనుక ఉన్న ఓ సమీకరణంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. అదే 34-26-5.

ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో 19 సీట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఉన్నాయి. అలాగే మరో 15 సీట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉన్నాయి. అలాగే కొవ్వూరు, నిడదవోలు రెండు సీట్లు పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో, రంపచోడవరం సీటు అల్లూరి జిల్లాలో కలిసింది. దీంతో రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సీట్ల సంఖ్య జిల్లాల పునర్విభజన తర్వాత 5 జిల్లాల్లో 35గా మారిపోయింది.

ఈ లెక్కన చూస్తే గతంలో 2014లో జనసేన మద్దతుతో టీడీపీ-బీజేపీ కలిపి ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో 34 సీట్లకు గానూ 26 సీట్లు గెల్చుకున్నాయి. వైసీపీ 5 సీట్లు గెల్చుకోగా.. బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత మారిన 35 సీట్లను అప్పటి లెక్కల ప్రకారం చూస్తే వైసీపీ ఆరు సీట్లు, టీడీపీ 27 సీట్లు గెల్చుకున్నాయి. బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. అయితే ఈ సమీకరణాలన్నీ తిరగబడి 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి తూర్పు గోదావరిలో 19కి 14, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15కు 13 సీట్లు గెల్చుకుంది. అంటే ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ 27 సీట్లు గెల్చుకుంది. ఈ సమీకరణం తిరిగి టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే 2014 తరహాలోనే తమకు అనుకూలంగా మారుతుందని పవన్ ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications