జగన్ కేబినెట్ ఖరారు-కొత్త మంత్రులు వీరే-రోజా సహా నలుగురు మహిళలు..!!
ఏపీలో ఏప్రిల్ 11న సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్ధీకరించనున్నారు. ఇందుకోసం భారీ కసరత్తే చేసిన జగన్.. తన కొత్త కేబినెట్లో ఉండబోయే మంత్రుల జాబితాను సిద్ధంచేశారు. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా విధేయత, సీనియార్టీ, పార్టీలో ముందునుంచీ తనకు అండగా ఉన్నవారు.. ఇలా పలు అంశాల్ని ఆయన ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి నలుగురు మహిళా మంత్రులకు చోటు దక్కబోతున్నట్లు సమాచారం.

జగన్ కేబినెట్ ఖరారు
ఏపీలో సీఎం జగన్ తన కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేశారు. ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత ప్రస్తుత మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని వారి స్ధానంలో కొత్త మంత్రుల రాకకు మార్గం సుగమం చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ కేబినెట్లోకి వచ్చే కొత్త మంత్రులపైనే జిల్లాల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే జగన్ మాత్రం ఇప్పటికే తన కొత్త కేబినెట్ మంత్రులను ఖరారు చేసేశారు. ఇక వారికి సమాచారం ఇవ్వడమే తరువాయిగా కనిపిస్తోంది. అయితే జిల్లాల్లో కొత్తగా మంత్రులయ్యే వారి జాబితాను పార్టీ వర్గాలు మాత్రం చూచాయగా బయటపెడుతున్నాయి.దీని ప్రకారం మంత్రివర్గ కూర్పు ఇలా ఉండబోతోంది.

కేబినెట్లో కొనసాగేది వీరే?
ఏపీలో త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ప్రస్తుత కేబినెట్లో ఉన్న ఐదురు మంత్రుల్ని కొనసాగించే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. వీరిలో ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ ఉన్నారు. రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, జిల్లాలు, ఇతరత్రా సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకని మరో అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వీరి స్ధానాల్లో పలువురు ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించినప్పటికీ దాని కంటే వీరిని కొనసాగించడమే మేలని జగన్ అంచనాకు వచ్చినట్లు అర్ధమవుతోంది.

రోజా సహా నలుగురు మహిళలకు ఛాన్స్
ప్రస్తుతం జగన్ కేబినెట్ లో హోంమంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు తానేటి వనిత మహిళా కోటాలో మంత్రులుగా ఉన్నారు. వీరి స్ధానాల్లో ఈసారి నలుగురు మహిళలకు చోటు కల్పించబోతున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చే మహిళా మంత్రుల్లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. వీరిలో డిప్యూటీసీఎం, హోంమంత్రి పదవులు ఎవరు దక్కించుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Recommended Video


కోస్తా జిల్లాల్లో మంత్రులు వీరే?
శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి అప్పలరాజు కేబినెట్లో కొనసాగనుండగా.. కొత్తగా ధర్మాన ప్రసాదరావుకు ఛాన్స్ దక్కబోతోంది. విజయనగరం జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే రాజన్నదొరతోపాటు కొల్లి భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించనున్నారు. విశాఖ జిల్లా నుంచి బూడి ముత్యాలనాయుడుతో పాటు గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఇస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు అవకాశం దక్కుతుండగా.. ప్రస్తుత మంత్రి వేణుగోపాలకృష్ణకు కొనసాగింపు ఉంటుందని సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పై గెలిచిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు దెందులూరులో చింతమనేనిపై గెలిచిన కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి, తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావుకు ఛాన్స్ దక్కనుంది.
కృష్ణా జిల్లా నుంచి బీసీ కోటాలో జోగి రమేష్, ఎస్సీ కోటాలో రక్షణ నిధి లేదా మొండితోక జగన్మోహనరావుకు అవకాశం దక్కబోతోంది. గుంటూరు జిల్లా నుంచి సిటీ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, వేమూరు ఎస్సీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జునకు అవకాశం దక్కనుంది. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి ఆధిమూలపు సురేష్ కొనసాగుతారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు సంజీవయ్యకు అవకాశం దక్కబోతోంది.

రాయలసీమ నుంచి మంత్రులు వీరే?
రాయలసీమ విషయానికొస్తే చిత్తూరు జిల్లా నుంచి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మహిళా కోటాలో అవకాశం దక్కించుకోబోతున్నారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కు కూడా అవకాశం దక్కుతోంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం కొనసాగనుండగా.. ఆయనకు తోడు కొత్తగా శిల్పా చక్రపాణిరెడ్డి, సుధాకర్ అవకాశం దక్కించుకోబోతున్నారు. అలాగే అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి శంకర్ నారాయణ కొనసాగనుండగా.. అనంత వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి మంత్రులయ్యే ఛాన్సే ఉంది. ఇక సీఎం సొంత జిల్లా కడప నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కే అవకాశముంది.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications