Balakrishna:నందమూరి బాలకృష్ణ భూరి దాతృత్వం
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు తెలియడంతోపాటు చికిత్సకు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు.
ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పటికే ఎంతోమందికి చేయూతనందించిన బాలయ్య తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సాయం చేశారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అతను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు తెలియడంతోపాటు చికిత్సకు రూ. 40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు. దాంతో, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకుని చలించిపోయిన బాలకృష్ణ అతనికి హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా ఒక బాలిక చికిత్సకు రూ.10 లక్షలు అందజేశారు.

సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత అని కథానాయకుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వారసత్వాన్ని మోయాలంటే ఎంతో రాటుదేలాలని, దాన్ని ముందుకు తీసుకువెళుతూనే తనంతట తానుగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నప్పుడే జీవితానికి ఓ అర్థం ఉంటుంది అన్నారు. హైదరాబాద్ లో 'వేద'ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శివరాజ్ కుమార్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. గీతా శివరాజ్ కుమార్ నిర్మించడగా, ఘనవి లక్ష్మణ్ కథానాయికగా నటించారు. ఈ నెల 9వ తేదీన ఈ చిత్రం తెలుగులో విడుదల కాబోతోంది. తన భార్యను నిర్మాతగా పరిచయం చేస్తూ శివ ఈ చిత్రాన్ని నిర్మించడాని, తనకు సోదరుడులాంటివాడన్నారు. శివ చేసిన మఫ్టీ చూసి వీరిసంహారెడ్డిలో పాత్రను తీర్చిదిద్దామని, వేద ట్రైలర్ చూశానని, అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఇది చాలా మంచి సినిమా అని, ఇందులో మంచి సందేశం ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చతుందనే ఆశాభావాన్ని శివరాజ్ కుమార్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదితి సాగర్, స్వామి, కృష్ణ, ఘనవి తదితరులున్నారు.












Click it and Unblock the Notifications