వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాలీవుడ్ పై హీరో నాని కీలక వ్యాఖ్యలు - ఇంటి గుట్టు రట్టు చేసారా : ఈ పరిస్థితికి అదే కారణం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

హీరో నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు నిర్ణయం...స్పందనలు..వివాదాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటం పైన టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను పెంచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న కొందరు హీరోలు..పరోక్షంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్నారు.

ముదురుతోన్న వివాదం

ముదురుతోన్న వివాదం

ఈ సమయంలోనే పలువురు ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమీక్షించి టిక్కెట్ల ధరల విషయంలో మార్పులు చేయాలని కోరుతోంది. ఇక, మరో వైపు సినిమా థియేటర్లలో అధికారుల సోదాలు కలకలం రేపాయి. అనేక థియేటర్ల ను అధికారులు సీజ్ చేసారు. మరి కొందరు థియేటర్లను యజమానులు స్వచ్చందంగా మాసేసారు. త్వరలో పెద్ద సినిమాలు విడుదల కానున్న వేళ.. థియేటర్లలో సోదాలు..టిక్కెట్ల ధరలు తగ్గించటం పైన కొందరు హీరోలు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పైన యువ హీరో నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

హీరో నాని కీలక వ్యాఖ్యలు

హీరో నాని కీలక వ్యాఖ్యలు

సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించటం అంటే...ప్రేక్షకులను అవమానించ టమే అంటూ వ్యాఖ్యానించారు. థియేటర్లలో వచ్చే వసూళ్ల కంటే, కిరాణకొట్టులో వచ్చే రోజువారి కలెక్షన్స్‌ ఎక్కువని నాని కామెంట్‌ చేశారు. ఇది తీవ్ర దుమారం రేపింది. దీనికి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్... బొత్స సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో..ఇప్పుడు నాని మరోసారి దీని పైన స్పందించారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారన్నారు. అదే సమయంలో తన వ్యాఖ్యల పైన ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

టాలీవుడ్ లో ఐక్యత లేదంటూ

టాలీవుడ్ లో ఐక్యత లేదంటూ

దీనికి కొనసాగింపుగా నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు కారణమయ్యాయి. వకీల్‌సాబ్‌ సినిమా విడుదల సమయంలోనూ థియేటర్ల సమస్య వచ్చిందన్న నాని.. అప్పుడే ఇండస్ట్రీ అంతా కలిసి పోరాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ లో ఐక్య‌త లేద‌ని అన్నారు. అంద‌రూ ఒకే తాటి పై ఉంటే ఈ సమ‌స్య ఎప్పుడో పరిష్కారం అయ్యేద‌ని అన్నారు. సరిగ్గా చెప్పి ఉంటే.. అధికారులు కూడా ఆలోచించి ఉండేవారేమోనని నాని అభిప్రాయపడ్డారు. ఇప్పడు నాని చేసిన వ్యాఖ్యల పైన టాలీవుడ్ లోనూ చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో ఐక్య‌త లేద‌ంటూ వ్యాఖ్యానించటం పైన పరిశ్రమ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇది బహిరంగ రహస్యమే అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారటంతో

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారటంతో

ఏపీ ప్రభుత్వం తో టాలీవుడ్ ప్రముఖులు నేరుగా చర్చలు చేస్తే మినహా.. సమస్య పరిష్కారం కాదనే వాదన ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు సైతం ప్రారంభించినట్లుగా చెబుతున్నారు. కానీ, వారితో చర్చల కు ప్రభుత్వం సిద్దంగా ఉందా.. సీఎం జగన్ తో చర్చిస్తేనే సమస్య పరిష్కారమని భావిస్తున్న వేళ..అందుకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది మరో చర్చ సాగుతోంది. దీంతో..ఇప్పుడు మొత్తంగా కొత్త సినిమాల విడుదల లోగానే సమస్య పరిష్కరించుకోవాలని టాలీవుడ్ భావిస్తోది. మరి.. ప్రభుత్వం చర్చలు చేస్తుందా.. టిక్కెట్ల విషయంలో నిర్ణయం మార్చుకుంటుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Hero Nani key comments on Tollwood, he says no unity among Telugu film stars in cruicial time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X