పిఠాపురంలో మెగా హీరోపై దాడి
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలింగ్‌కు కేవలం ఒక వారం మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల తరుఫున అన్ని పార్టీల అధినేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు.
ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ,నాగబాబు ,ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాగబాబు ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాజాగా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన మామయ్య కోసం సాయి ధరమ్ తేజ్ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పిఠాపురంతో పాటుగా మూడు చోట్ల ఆయన ప్రచారం చేసి ప్రజలతో ముచ్చటించారు. అయితే సాయి ధరమ్ తేజ్ పర్యటనలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.సాయి ధరమ్ తేజ్‌పై దాడి జరిగింది. కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఆయనపై కొందరు కూల్ డ్రింక్ బాటిల్స్ విసిరారు.
అయితే ఈ దాడిలో సాయి ధరమ్ తేజ్ తృటిలో తప్పించుకున్నారు. కానీ ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త నల్ల శ్రీధర్‌కు ఓ బాటిల్ తగలడంతో కంటిపై గాయం అయింది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండగా అది గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇదంతా వైసీపీ నేతల పనే అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్‌పై దాడి జరిగిందని తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications