పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నా: సినీ హీరో శివాజీ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలుగు సినీ హీరో శివాజీ స్పందించారు. 'ప్రశ్నించడానికే వస్తున్నా' అన్న నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్న పవన్ కల్యాణ్‌ను తాను అభినందిస్తున్నానని చెప్పారు. ప్రశ్నించే నాయకుడు ఇన్నాళ్లు లేకపోవడం దౌర్భాగ్యకరమైన విషయమని, ఇదే నినాదంతో వవన్ వస్తే ప్రజలు ఆదరించి, గెలిపిస్తారని అభిప్రాయపడ్డారు.

రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టిపోయాయని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తిట్టిన వారిని ఈ రోజు పార్టీల్లో చేర్చుకుంటున్నారని తప్పు పడుతూ ఒక రోజులోనే ఆ నాయకుడు మంచివాడై పోతాడా అని శివాజీ ప్రశ్నించారు. ఇది అన్ని పార్టీలకూ వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల నియామవళి అమల్లోకి రావడంతో ఇప్పటికే అన్ని పార్టీల నేతలు వారివారి ప్రాంతాల్లో మద్యం, డబ్బును సిద్ధంగా ఉంచారని విమర్శించారు.

Hero Shivaji invites Pawan Kalyan's party

రాజకీయ పార్టీలు కుల పార్టీలైపోతున్నాయని కూడా శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కూడా వీటిని గమనించాలని ఆయన సూచించారు. ఎంతకాలం ఇలాగే మోసపోతారని ఆయన ప్రజలను ప్రశ్నించారు. అందుకే కళాకారులు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు.

ప్రస్తుత తరుణంలో సమయంలో మంచి వ్యక్తి అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. శివాజీ ఇటీవల వివిధ సమస్యలపై ప్రభుత్వం మీద పోరాటం ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+