వస్తున్నా! బాబు డబ్బులిచ్చారా? బూట్లూ నాకే వారికి గుంటూరు కారం తినిపిస్తా: శివాజీ ఘాటు వ్యాఖ్యలు
అమరావతి: తనపై వస్తున్న విమర్శలపై ఆపరేషన్ గరుడ అంటూ సంచలనాలకు తెరలేపిన సినీ నటుడు శివాజీ తీవ్రంగా స్పందించారు. తాను చావుకు భయపడి పారిపోయేంత పిరికివాడిని కాదని ఆయన అన్నారు. అమెరికా నుంచి తాను నవంబర్ 10వ తేదీన తిరిగి వస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు డబ్బులు పంపారా?
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పట్టడం, వారి బూట్లు నాకుతున్న తెలుగు నేతల బండారాన్ని బయటపెట్టడమే తన లక్ష్యమని శివాజీ చెప్పారు. ఇప్పటికే తన లక్ష్యానికి చేరువలో ఉన్నానని తెలిపారు. చంద్రబాబు డబ్బులు, నిధులు తనకు పంపించారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

నేను పారిపోయానా?
అమెరికాకు పారిపోవడం ఉండదని, టికెట్ ఉంటేనే ఆ దేశంలోకి ఎంట్రీ అయినా, ఎగ్జిట్ అయినా ఉంటుందని శివాజీ చెప్పారు. తన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10వ తేదీన ఇండియాకు తిరిగి రావాల్సి ఉందని, మీకేమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడే వస్తానని తనపై విమర్శలు చేసేవారిని ఉద్దేశించి శివాజీ వ్యాఖ్యానించారు.

వైసీపీకెందుకంత కంగారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంగాపడుతున్నట్లుగా తాను కంగారు పడటం లేదని అన్నారు. అమెరికాకు వచ్చిన తర్వాత మూడు సమావేశాలు పెట్టుకున్నానని, తన కుమారుడి పని పెట్టుకున్నానని, ఆ పని కూడా పూర్తి చేసుకున్నానని శివాజీ తెలిపారు.
Recommended Video


బూట్లు నాకిన వారికి గుంటూరు కారం తినిపిస్తా..
ఢిల్లీ నేతలు మోకాళ్లపై కూర్చోమంటే మన నేతలు ఏకంగా సాష్టాంగపడుతున్నారని, అలాంటి నేతలను నిటారుగా నిలబెట్టాలని శివాజీ అన్నారు. వాళ్ల బూట్లు నాకి వీరి నోర్లు మొద్దుబారి పోయాయని, వీరందరికీ గుంటూరు కారం తినిపించేందుకు తిరిగి వస్తున్నానని అన్నారు. అంతేగాక, అందరూ రెడీ ఉండాలని వ్యాఖ్యానించారు. ఎవరేం చేసుకుంటారో చేసుకోవచ్చని.. తాను అన్నింటికీ సిద్ధమేనని శివాజీ అన్నారు.

లక్ష్మీపార్వతిని చూస్తే జాలేస్తోంది..
వైసీపీ నేత లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపైనా శివాజీ స్పందించారు. టీడీపీవారు చంపేస్తారని తన మీద జాలి అవసరం లేదని ఆమెకు సూచించారు. ఆమెను చూస్తుంటేనే జాలి వేస్తుందని అన్నారు. ఆ పార్టీలో మీకేమీ ఇవ్వరని, అలా అరుచుకుంటూ గడపాల్సిందేనని అన్నారు. తాను ఏపీ హోదా కోసం, ఏపీ కోసం పోరాడుతూనే ఉంటానని శివాజీ చెప్పారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications