సొంత మంత్రులపై విరుచుకుపడ్డ హీరో శివాజీ, హెచ్చరిక
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ ఆదివారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రమంత్రులు వస్తే వారిని సెల్ టవర్లు ఎక్కిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లాకు చెందిన సంజీవ రావు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కారు. దీనిపై శివాజీ స్పందించారు.
ఇప్పటికే సంజీవ రావు విషయమై సభాపతి కోడెల శివప్రసాద్‌తో మాట్లాడామని చెప్పారు. అధికారులతో మాట్లాడి అతనిని కిందకు దింపే ప్రయత్నం చేస్తామన్నారు. సంజీవ రావు డిమాండులో న్యాయముందన్నారు. అతనికి ఏదైనా జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహాన్ని చూస్తాయన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ గుంటూరు జిల్లా కేంద్రంలోని మంగళదాస్ నగర్‌లో సంజీవ రావు అనే యువకు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా కోసం 24 గంటలుగా టవర్ పైనే ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో రంగంలోకి పోలీసులు, ప్రజాప్రతినిధులు అతన్ని కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిర్వాసితులను ఆదుకుంటాం: మృణాళిని
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భోగాపురం అనువైన ప్రాంతమని మంత్రి మృణాళిని ఆదివారం అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేస్తున్నాయన్నారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, భూనిర్వాసితులను ఆదుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications