రాత్రి పూట, చిత్తూరు జిల్లాలో మానవత్వం చాటిన హీరో సూర్య
చిత్తూరు: తమిళనటుడు సూర్య మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను తన వాహనంలో ఎక్కించుకొని చికిత్స నిమిత్తం తరలించాడు. సూర్య సహాయం అందరి మన్ననలను అందుకుంది. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది.
తన తాజా చిత్రం '24' సినిమా షూటింగ్ నిమిత్తం సూర్య చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఈడిగపల్లెకు వచ్చాడు. గ్రామ సమీపంలోని క్వారీ వద్ద రాత్రి వరకు షూటింగులో పాల్గొన్నాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు.

మార్గమధ్యలో వలసపల్లె వద్ద ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన మహిళ రోడ్డుపై పడి ఉంది. ఆమె రోడ్డుపై పడి ఉండటాన్ని హీరో సూర్య గుర్తించాడు. ఆమెను తన వాహనంలో ఎక్కించుకొని, చికిత్స నిమిత్తం తిరుపతి తరలించారు. మదనపల్లె చేరుకున్నాక ఆ మహిళ పరిస్థితిపై ఆరా తీశారు.












Click it and Unblock the Notifications