World Cup 2023: సెమీస్, ఫైనల్స్ లో ఆడేది వాళ్లే - హీరో వెంకటేష్..!!
టీమిండియా హీరోల ఆట చూసేందుకు సినీ హీరోలు తరలి వస్తున్నారు. ఇండియా వర్సస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ను టాలీవుడ్ హీరో వెంకటేష్ లక్నోలో ప్రత్యక్షంగా తిలకించారు. క్రికెట్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేసారు. ఇంగ్లాండ్ పైన విజయాన్ని ఆస్వాదించారు. ఇదే సమయంలో ఈ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరే నాలుగు జట్లు..ఫైనల్ ఆడే రెండు జట్లతో పాటుగా ప్రపంచ విజేత ఎవరో కూడా వెంకటేష్ చెప్పేసారు. వెంకటేష్ అంచనాలు ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య వైరల్ అవుతున్నాయి.
సెమీస్ కు టీమిండియా : ప్రపంచ కప్ లో రోహిత్ సేన దూకుడు కొనసాగుతోంది. ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ ఆన్నింటా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. డిఫెండింగ్ చాంఫియన్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన ఆట తీరుతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుతాయి. ఇప్పటి వరకు భారత్ టాప్ లో ఉండగా.. దక్షిణా ఫ్రికా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా తరువాతి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి జరిగే మ్యాచ్ ల్లో అనూహ్య ఫలితాలు..సంచలనాలు నమోదు అయితే మినహా ఈ నాలుగు జట్లు సెమీస్ చేరటం ఖాయంగా కనిపిస్తోంది.

హీరో వెంకటేష్ సందడి : ఇక, భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన హీరో వెంకటేష్ ప్రపంచ కప్ సెమీస్, ఫైనల్స్ తో పాటుగా కప్ విన్నర్ పైన తన అంచనాలను వెల్లడించారు. లక్నోలో మ్యాచ్ సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్ మొయిన్ అలీ ఔటై పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో వెంకటేష్ చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక.. మ్యాచ్ పైన కామెంట్రీ బాక్స్ లో వెంకటేష్ సందడి చేసారు. రోహిత్ బ్యాటింగ్ తీరును ప్రశంసించారు. బౌలర్లు షమీ, బూమ్రా, కుల్ దీప్ బంతితో చేసిన విన్యాసాల పైన ప్రశంసలు కురిపించారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్స్ ను ప్రత్యక్షంగా చూసిన తాను ధోనీ కొట్టిన విన్నింగ్ షాట్ సిక్స్ ను ఇప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత టీమిండియా సెలబ్రేషన్స్ లో తానూ పాల్గొన్న అంశాన్ని వివరించారు. హోటల్ లో ధోనీతో ఏం జరిగిందో కూడా చెప్పుకొచ్చారు.
ఫైనల్స్ చేరేది ఈ రెండు జట్లే : ఈ ప్రపంచ కప్ లో సెమీస్ ఇప్పుడు టాప్ లో ఉన్న నాలుగు జట్ల మధ్యనే ఉంటుందని వెంకటేష్ అంచనా వేసారు. సెమీస్ కు భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా వెళ్తాయని..రెండు మ్యాచ్ లు హోరా హోరీగా సాగుతాయని తన అంచనగా చెప్పుకొచ్చారు. సెమీస్ లో గెలిచి ఇండియా - న్యూజీలాండ్ ఫైనల్స్ ఆడుతాయని వెంకటేష్ ప్రిడిక్ట్ చేసారు. ఫైనల్స్ లో మాత్రం 2019 ప్రపంచ కప్ సెమీస్ తో భారత్ ను ఓడించిన న్యూజీలాండ్ ను రోహిత్ సేన ప్రతీకారంగా ఈ సారి ఫైనల్స్ లో బాదేసి..ప్రపంచ విజేతగా నిలుస్తుందంటూ జోస్యం చెప్పారు. సెమీస్ వరకు వెంకటేష్ చెప్పిన అంచనాలు.. సంచలనాలకు మారు పేరైన వన్డే క్రికెట్..అందునా ప్రపంచ కప్ లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతోంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications