జగన్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల ఎప్పుడూపై పరొక్షంగా ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది.
రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. రాజకీయ నేతలపై, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలపై పెట్టే పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారేవి. ఇటీవల కాలంలో పూనమ్ కౌర్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా నిలుస్తోంది. జగన్ తీసుకుంటున్న సంస్కరణలకు మద్దతుగా ఆమె ట్వీట్లు చేసింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ రాజకీయాల గురించి తనదైనశైలిలో స్పందించారామె.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిన విషయమే. దీంతో ఆమె పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. సుగాలి ప్రీతీ మరణం గురించి ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు. సుగాలి ప్రీతీ హత్య జరిగి చాలా కాలం అయిందని..దానిపై సమగ్ర విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయ చేయాలంటూ ట్వీట్ చేసింది.
The architects of #ysjaganmohanreddy garu’s previous success were the three important women of his life , his mother , his sister , his wife YS Bharathi garu who truly teaches patience and perseverance in her own ways , I wish the entire family togetherness , love and peace ✌️ 🙏
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 7, 2024
తాజాగా ఆమె ఏపీ మాజీ సీఎం జగన్ గురించి ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల్లో జగన్‌కు తోడుగా భారతి, విజయమ్మ, షర్మిల ఎవరి పాత్ర వారు పోషించారు. వీరందరు కూడా తమదైనశైలిలో జగన్‌కు పట్టుదల నేర్పించారు. మళ్లీ జగన్ కుటుంబం అంతా కలవాలని అనుకుంటున్నా అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications