సిమి ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హైఅలర్ట్

నెల్లూరు: సిమి ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు.

చెన్నై బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపి, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

 High alert: Simi terrorists in Tada mandal

తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఈజాజ్, మహబూబ్, అబూ ఫైజల్, ఫొటోలను తమిళనాడు పోలీసులు ఇప్పటికే తడ పోలీసులకు పంపించారు.

దీంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ పని చేస్తున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

కాగా, కోస్తా తీర ప్రాంత గస్తీపై మంగళవారం ఏపి సిఎం చంద్రబాబునాయుడితో నేవీ చీఫ్ సమావేశమై చర్చలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+