YS Viveka Case: అవినాష్ ముందస్తు బెయిల్ - ఉత్కంఠ..!!
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు తీర్పు తరువాత సీబీఐ అడుగుల పైన ఆసక్తి నెలకొంది. వివేకా హత్య కేసుల సీబీఐ ఇప్పటికే ఎంపీ అవినాష్ ను సుదీర్ఘంగా విచారించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత మరోసారి అవినాష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ మొదలైంది. అవినాష్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు ఈ రోజు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.
కొనసాగుతున్న ఉత్కంఠ:అవినాష్ ముందస్తు బెయిల్ పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తాజాగా గత వారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన తరువాత ఈ తిరిగి హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. అవినాష్ తరపు న్యాయవాద తన వాదనలు మరోసారి వినిపించారు. హత్య జరిగిన రోజున తాను జమ్మల మడుగు వెళ్తున్న సమయంలో ఫోన్ వచ్చిందని చెప్పారు. హత్యలో నిందితుడు గా ఉన్న దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తన పైన అభియోగాలు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. గుగూల్ టేకవుట్ కు శాస్త్రీయత లేదని..అందులోనూ అనేక అనుమానాలు ఉన్నాయని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. ఎంత దూరంలో ఉన్నారనే దాని పైన స్పష్టత ఇందులో ఉండదన్నారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు:ఇదే సమయంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశాల పైన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణకు సీబీఐ సహకరించటం లేని కారణంగానే లిఖిత పూర్వకంగా సమాచారం తీసుకోవాలని సూచించామని పేర్కొంది. అవినాష్ రెడ్డి పైన కేసులు ఉన్నాయని సునీత తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికల కేసులు మినహా, ఎటువంటి కేసులు లేవని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. గూగుల్ టెక్‌ఔట్ గురించి తెలియకుండానే సీబీఐ ఆధారపడుతోందని వివరించారు. ఏ కోర్టు కూడా గూగుల్ టేక్ఔట్‌ను ఆధారంగా పరిగణించదన్నారు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది. ఎప్పుడు దర్యాప్తుకు రమ్మన్నా పూర్తిగా సహకరిస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు. అరెస్ట్ చేయకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసుకోవచ్చాని గతంలో సుప్రీం ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
నేడు నిర్ణయం వెలువడే ఛాన్స్:వాదనల్లో భాగంగా సునీత తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ ఇవ్వాలంటే విచారణ సంస్థ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ రోజు వాదనలు పూర్తయిన తరువాత కోర్టు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పైన కోర్టు నిర్ణయానికి అనుగుణంగా సీబీఐ తమ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో కోర్టు నిర్ణయం పైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications