తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు పచ్చజెండా

ఇప్పటికే సర్వేకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు పూర్తి వివరాలు ఇచ్చిందని, సమగ్ర సర్వే నిర్వహిస్తున్నది కేవలం లబ్దిదారులను గుర్తించేందుకేనని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తుది తీర్పును వెలువడించింది.
ఈ సర్వేపై ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన వివరణతో కోర్టు ఏకీభవించింది. ఇప్పటికిప్పుడే సర్వేను ఆపలేమని కోర్టు తేల్చిచెప్పింది. అలాగే ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పెద్ద యెత్తున సమగ్ర కుటుంబ సర్వేను తలపెట్టింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేపట్టింది.












Click it and Unblock the Notifications