'ఓటుకు నోటు నుంచి బాబు తప్పించుకోవాలనుకోవట్లేదు, కానీ వైసీపీ ఎమ్మెల్యే ఎలా'
హైదరాబాద్: ఓ క్రిమినల్ కేసు విచారణలో కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి ప్రమేయం ఉండటానికి ఎంతమాత్రం వీల్లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫు లాయర్ సిద్ధార్థ లూత్రా సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాఫ్తు జరపాలని కోర్టును ఆశ్రయించే అర్హత లేదన్నారు. ఆయనకు ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాసం లేదని చెప్పారు. అందుకు చట్ట నిబంధనలు అనుమతించవని చెప్పారు.
ఇదీ విషయం!: ఓటుకు నోటుపై హైకోర్టులో బాబు లాయర్ వాదనలు పూర్తిఓటుకు నోటులో ఏసీబీ దర్యాఫ్తు పైన తమకు అభ్యంతరం లేదని, దాని నుంచి తప్పుకోవాలనే ఉద్దేశ్యం లేదని, కానీ నిబంధనలకు విరుద్ధంగా దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణకు ఆదేశించడం పైనే తమ అభ్యంతరమని ఈ సందర్భంగా తెలిపారు.

ఓటుకు నోటు కేసుతో ఎలాంటి సంబంధం లేని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ప్రయివేటు ఫిర్యాదు పైన ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడం సరికాదన్నారు. అదేవిధంగా కేసుతో ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ ుకమార్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడాన్ని కూడా వ్యతిరేకించారు.
ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు స్టీఫెన్ సన్ అని, ఘటన తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పారు. కేసులో విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులే చెబుతున్నారని, అలాంటప్పుడు ఉండవల్లి ఎందుకు వచ్చి పడ్డారని ప్రశ్నించారు. ఉండవల్లికి లోకల్ స్టాండీ లేదని, ఈ కేసుతో సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications