ఇదీ విషయం!: ఓటుకు నోటుపై హైకోర్టులో బాబు లాయర్ వాదనలు పూర్తి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన అప్పీలు పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు విన్పించారు.
ఆయన వాదనల్ని విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. సోమవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

కాగా, ఓటుకు నోటు కేసులో నాలుగు రోజుల క్రితం విచారణ ప్రారంభమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ప్రకంపంలు సృష్టించిన విషయం తెలిసిందే.
దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో తన ప్రమేయంపై విచారణ జరిపించాలంటూ ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వాదనలు విన్నది.
చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఏసీబీ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఈ రోజు వాదనలు కొనసాగాయి.












Click it and Unblock the Notifications