చంద్రబాబు తల తెగ నరుకుతామన్న వైసీపీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తల తెగ నరుకుతామన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హైకోర్టు బెయిల్ మంజారు చేసింది. విశాఖ జిల్లా చింతపల్లిలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల తెగ నరుకుతామని ఆవేశపూరితంగా ప్రసంగించారు.
చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. అనంతరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి, పాడేరు, అరకు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు.

విశాఖ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో 124(ఎ) 307, 506, 511 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. శుక్రవారం ఆమెకు బెయిల్ మంజారు చేయడంతో శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు.












Click it and Unblock the Notifications