హైకోర్టుకు ఆళ్ల: చంద్రబాబు, గోకరాజు సహా 57మందికి నోటీసులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 57మందికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కృష్ణా నది పరివాహక కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఆయన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఏపీ సీఎంతోపాటు 57మందికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక, ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

high court issues notice to ap cm chandrababu naidu

కాగా, సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన లింగమనేని గ్రూపు నుంచి లీజుకు తీసుకున్నారు. ఇందులో లింగమనేని రమేష్, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన భవనాలు, మంతెన సత్యనారాయణ రాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కట్టడాలున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court issued notices to Andhra Pradesh CM Chandrababu Naidu in Krishna river karakatta.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి