టిడిపికి ఝలక్, జగన్‌కు ఊరట: టిడిపిలో చేరిన 20మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
విజయవాడ: ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరిన శాసన సభ్యులకు షాక్ తగిలింది. టిడిపిలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిట్ పిటిషన్ విచారణార్హతపై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇరవై మంది శాసన సభ్యులు ఆ తర్వాత టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి సహా ఇరవై మంది సైకిల్ ఎక్కారు. దీంతో వైసిపి బలం 67 నుంచి 47కు పడిపోయింది.

దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టు గడప తొక్కింది. విచారణ జరిపిన న్యాయస్థానం వైసిపి నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇది వైసిపికి ఊరట అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications