చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్: ఆయన నియామకం చెల్లదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు శుక్రవారంనాడు తీర్పు ఇచ్ిచంది. ఆయన ఎంపిక తీరును హైకోర్టు తప్పు పట్టింది.
కారెం శివాజీ కేవలం మాలమహానాడు అధ్యక్షుడు మాత్రమేనని, ఆయనను ఇలాంటి కమిషన్‌కు ఎంపిక చేయడం ఏమిటనే వాదనలు ముందుకు వచ్చాయి. ఇంత ముఖ్యమైన నియామకం చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిలోంచి ఎంపిక చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది.

ఆ పదవికి అసలు అర్హతలు ఏమిటనే విషయంలో కూడా ఏ విధమైన నిబంధనలు పెట్టలేదని, ఎవరి నుంచి దరఖాస్తులు తీసుకోకుండా ముఖ్యమైన సంస్థకు చైర్మన్‌గా నియచం సరి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆ విషయంలో కారెం శివాజీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. సమర్దుడైన మరో వ్యక్తిని నియమించుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో అపీల్‌కు వెళ్లడానికి కూడా హైకోర్టు అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగిందని చెప్పింది.












Click it and Unblock the Notifications