అమరావతి: చంద్రబాబుకు హైకోర్టులో షాక్, జగన్‌కు గ్రామస్తుల థ్యాంక్స్, ఆళ్ల ఆగ్రహం
భూసేకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో సోమవారం నాడు చుక్కెదురైంది. గుంటూరు - పెనుమాకలలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం
విజయవాడ/హైదరాబాద్: భూసేకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో సోమవారం నాడు చుక్కెదురైంది. గుంటూరు - పెనుమాకలలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం హితవు పలికింది.
రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి భూములు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పెనుమాకలో భూసేకరణపై ప్రభుత్వం ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్
రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
దీంతో 904 మంది భూయజమానులు ప్రభావితులవుతారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయింది.

హైకోర్టు తీర్పుపై రైతులు
హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పెనుమాక రైతులు స్వాగతించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ తరపున పోరాడుతున్నందుకు వైసిపి అధినేత జగన్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామన్నారు.

చిన్న రైతులను ఇబ్బంది పెట్టవద్దు
చిన్న చిన్న రైతులను భూమి కోసం ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఈ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందన్నారు. ల్యాండ్ పూలింగ్ పైన కోర్టు స్టే విధించడం సంతోషకరమన్నారు.

అక్రమాల కోసమే
అక్రమాల కోసమే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని భావిస్తున్నారని ఆళ్ల ఆరోపించారు. పోలీసులతో రైతులను భయభ్రాంతులకు గురి చేసి లాక్కుందామని చూస్తున్నారన్నారు.
ఇప్పటి వరకు తీసుకున్న భూమిలోనే ఒక్క శాతం వినియోగంలోకి రాలేదన్నారు. గ్రామస్తులను బెదిరించి గ్రామ సభలు నిర్వహించారని మండిపడ్డారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్











Click it and Unblock the Notifications