హిందూయేతర ఉద్యోగుల్ని తొలగించొద్దు: టీటీడీకి హైకోర్టు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో హిందూయేతరులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని టీటీడీకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్యమతస్తులను ఉద్యోగాల్లో కొనసాగించాలని సూచించింది. టీటీడీ సంజాయిషీ నోటీసులకు వివిరణ ఇవ్వాలని ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. ఈ సంజాయిషీ నోటీసుల చట్టబద్ధతను తర్వాత పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.

సుమారు 44మంది హిందూయేతరులు నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications
