ఆస్తులు ఎక్కువ చూపిస్తారా: అగ్రిగోల్డ్‌పై హైకోర్టు సీరియస్, టిడిపి నాయకుల అపహరణ
హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం నాడు వాడిగావేడిగా వాదనలు జరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు, సిఐడీ చీఫ్ ద్వారకా తిరుమల రావు, ఇతర అధికారులు హైకోర్టులో విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాధితులకు చెల్లించేందుకు... అగ్రిగోల్డ్ సంస్థ చూపిన ఆస్తుల విలువ పైన హైకోర్టు ఆరా తీసింది. తాము బెంగళూరు, విజయవాడల్లోని 348 ఎకరాల స్థలాలు అమ్మితే రూ.2,500 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ తెలిపింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
348 ఎకరాలు అమ్మితే అంత డబ్బు ఎలా వస్తుందని, ఆ రెండూ కలిపితే కేవలం రూ.300 కోట్లే వస్తుందని గుర్తు చేసింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తే ఊరుకోమని హెచ్చరించింది.

బెంగళూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే స్థలానికి, అలాగే విజయవాడ దగ్గరలోని స్థలానికి.. ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు కూడా రాదని చెప్పింది. అలాంటప్పుడు రూ.2,500 కోట్లు వస్తాయని ఎలా చెబుతారని అగ్రిగోల్డ్‌పై సీరియస్ అయింది.
ఐదు ప్రధాన ఆస్తులను అమ్మేందుకు హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 300 ఆస్తుల వివరాలను అగ్రిగోల్డ్ కోర్టుకు సమర్పించింది. కాగా, అగ్రిగోల్డ్ పైన వాదనల అనంతరం ఉత్తర్వులను 9వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఉత్తర్వులు ఇవ్వనుంది.
తిరుమల రెండో కనుమ రహదారిపై జారిపడ్డ కొండచరియలు
తిరుమల రెండో కనుమ రహదారిపై కొండచరియలు జారిపడ్డాయి. లింక్ రోడ్డు సమీపంలో కొండచరియలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రహదారికి అడ్డంగా ఉన్న కొండచరియలను తితిదే సిబ్బంది క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు. లింక్‌రోడ్డు నుంచి ఒకటో కనుమ రహదారికి వాహనాలను మళ్లిస్తున్నారు. ఒకటో కనుమ రహదారిలో ప్రత్యేక బలగాలు మోహరించి వాహనాల రద్దీని నియంత్రిస్తున్నాయి.
రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్ల పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పర్‌లో తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీతో స్మగ్లర్లు టిప్పర్‌ను వదిలేసి పరారయ్యారు.
ముగ్గురు టిడిపి నాయకులను అపహరించిన మావోయిస్టులు
విశాఖ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. విశాఖజిల్లా జీకే వీధి మండలం కొత్తగూడలో ముగ్గురు టిడిపి నాయకులను మావోయిస్టులు అపహరించారు. జీకే వీధి మండల తెదేపా అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్, టిడిపి నాయకులు మహేశ్, బాలయ్యలను మావోయిస్టులు అపహరించారు.












Click it and Unblock the Notifications