శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సివిల్స్ 3వ ర్యాంకర్‌కు షాక్: గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

సివిల్ సర్వీసెస్ -2016లో మూడో ర్యాంక్ సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: సివిల్ సర్వీసెస్ -2016లో మూడో ర్యాంక్ సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు మంగళవారం నాడు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.

గోపాలకృష్ణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే యూపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని, దీనిపై విచారణ జరపాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే.

<strong>సివిల్స్ 3వ, ర్యాంకర్ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్, ఎందుకంటే?</strong>సివిల్స్ 3వ, ర్యాంకర్ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్, ఎందుకంటే?

యూపీఎస్ సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ -2016 లో గోపాలకృష్ణకు సివిల్స్‌లో మూడో ర్యాంకు వచ్చింది. అయితే అతడికి ఈ ర్యాంకు కేటాయించడం చట్టవిరుద్దంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన న్యాయవాది ఎం మురళీకృష్ణ పిల్ దాఖలు చేశారు.

 High Court serves notices to Civils 3rd ranker Gopala Krishna

ఇందులో కేంద్ర వ్యక్తిగత శిక్షణశాఖ కార్యదర్శి, యూపీఎస్ సీ జాయింట్ సెక్రటరీ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. నోటీసులు జారీ చేసిన అనంతరం కేసును మూడు వారాల పాటు వాయిదా వేసారు.

English summary
High Court serves notices to Civils 3rd ranker Gopala Krishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X