కడప మేయర్ తొలిగింపు పై హైకోర్టు స్టే..!!
కడప మేయర్ తొలిగింపు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. మేయర్ తొలిగింపు పై స్టే విధించింది. సింగిల్ జడ్జ్ తీర్పును హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. కడపలో మహా నాడు జరుగుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన స్టే విధించటం రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమవుతోంది. వైసీపీకి ఇది పెద్ద రిలీఫ్ గా మారింది. ఇప్పుడు స్టే ఆదేశాల పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది కీలకంగా మారుతోంది.
కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేశ్‌బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మేయర్ బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల పై స్టే విధించింది. తొలగింపు జీవోను సస్పెండ్ చేయాలంటూ సురేష్ బాబు వేసిన అనుబంధ పిటీ షన్‌ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే న్యాయస్థానం ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చారు. తనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సురేశ్ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు.

వివరణ ఇచ్చేందుకు సమయం కోరిన పిటిషనర్ వినతిని పరిగణలోకి తీసుకోకుండానే పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చార న్నారు. పురపాలక శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది, కడప ఎమ్మెల్యే మాధవి తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పిటిషనర్.. తన పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి పనుల కేటాయింపు విషయం తనకు తెలియదన్న పిటిషనర్ వాదనలో అర్ధం లేదన్నారు. పిటిషనర్‌కు నోటీసు ఇచ్చి వివరణ తీసు కున్న తర్వాతే ముఖ్య కార్యదర్శి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. దీనిలో జోక్యం చేసుకోవ ద్దని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. కాగా, ఇప్పుడు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు వైసీపీకి రిలీఫ్ ఇవ్వనున్నాయి.












Click it and Unblock the Notifications