• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగొచ్చిన కేంద్రం..జ‌గ‌న్ కేసు ఎన్ఐఏ కు అప్ప‌గింత‌.. ఏపి ప్ర‌భుత్వానికి షాక్‌..!

|

జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడి కేసును ఎన్ఐఏ కు అప్ప‌గిస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. కొంత కాలంగా ఈ కేసు రాజ‌కీయంగా అనేక మ‌లుపులు తిరిగింది. దీనిని రాష్ట్ర ప్ర‌భుత్వం చేయించిన దాడిగా వైసిపి..ఇటు జ‌గ‌న్ సానుభూతి కోసం చేయించుకున్న దాడి టిడిపి ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. ఇక‌, తాజాగా హైకోర్టు సూచ‌న మేర‌కు దిగొచ్చిన కేంద్రం ఎన్ఐఏ విచార‌ణ‌కు అంగీక‌రించింది. మ‌రి..ఇప్పుడే ఏపి ప్ర‌భుత్వం ఏం చేస్తుంది...

సంచ‌ల‌నం కోస‌మే దాడి..కాదు, కుట్ర పూరితం..

సంచ‌ల‌నం కోస‌మే దాడి..కాదు, కుట్ర పూరితం..

వైసిపి అధినేత పై జ‌రిగిన దాడి ఏపిలో క‌ల‌క‌లం సృష్టించింది. దాడి జ‌రిగిన వెంట‌నే డిజిపి మీడియా స‌మావేశం పెట్టి ఇది సంచ‌ల‌నం కోసం చేసిన దాడిగా చెప్ప‌టాన్ని వైసిపి నేత‌లు తప్పు బ‌ట్టారు. అయితే, జ‌గ‌న్ త‌న పై జ‌రిగిన దాడి గురించి ఎక్క‌డా ఫిర్యాదు చేయ‌లేదు. దాడి జ‌రిగిన త‌రువాత విశాఖ‌లో చికిత్స చేయించుకోకుండా..హైద‌రాబాద్ వెళ్ల టం పైనా ముఖ్య‌మంత్రి స‌హా..టిడిపి నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా, ఇదే కేసు పై విశాఖ న‌గ‌ర క‌మిష‌న‌ర్ ల‌డ్హా సైతం ఇది సంచ‌ల‌నం కోసం చేసిన దాడిగా ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో వైసిపి నేత‌లు మాత్రం ఏయిర్ పోర్టులో క్యాంటీన్ నిర్వ‌హ‌కుడు టిడిపి మ‌ద్ద‌తు దారుడ‌ని..టిడిపి నేత‌ల ప్రోద్భ‌లంతోనే ఈ దాడి జ‌రిగంద‌ని ఆరోపిస్తూ వ‌చ్చారు. తాజాగా, ఈ కేసును ఏపి పోలీసుల‌కు కాకుండా..విమానాశ్ర‌యంలో జ‌రిగిన దాడి కావ‌టంతో ఎన్ఐఏ కు విచార‌ణ అప్ప‌గించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు.

దిగొచ్చిన కేంద్రం..ఏపి ప్ర‌భుత్వం ఏం చెబుతుంది..!

దిగొచ్చిన కేంద్రం..ఏపి ప్ర‌భుత్వం ఏం చెబుతుంది..!

జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన వెంట‌నే వైసిపి శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. జ‌గ‌న్ దాదాపు 15 రోజుల వ‌ర‌కు త‌న పాద‌యా త్ర ను నిలిపివేసి విశ్రాంతి తీసుకున్నారు. ఆ త‌రువాత త‌న పై జ‌రిగిన దాడిని జ‌గ‌న్ వివ‌రించారు. తాను ఎవ‌రి పైనా అబాంఢం వేయ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఏం మాట్లాడ‌లేద‌ని..ప్రాధ‌మిక చికిత్స త‌రువాత అక్క‌డ ఉన్న వారి అనుమ‌తి తోనే హైద‌రాబాద్ వెళ్లాన‌ని వివ‌రించారు. అయితే, అధికార పార్టీకి అండ‌గా ఉంటున్న ఏపి పోలీసుల‌తో కాకుండా..ఈ కేసు మూడో విచార‌ణ సంస్థ‌కు అప్ప‌గించాల‌ని వైసిపి డిమాంఢ్ చేస్తూ వ‌చ్చింది. దీని పై గ‌వ‌ర్న‌ర్ ను సైతం క‌లిసింది. ఇక‌, హైకోర్టులో కేసు దాఖ‌లు చేసిన వైసిపి..ఎన్ఐఏ కు అప్ప‌గించాల‌ని కోరింది. దీని పై హైకోర్టు కేంద్ర - రాష్ట్ర ప్ర‌భు త్వాల స్పంద‌న కోరింది. ప్ర‌భుత్వాలు స్పందించ‌కుంటే తామే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తేల్చింది . దీంతో..దిగొచ్చి న కేంద్రం..ఎన్ఐఏ కు కేసు అప్ప‌గించటానికి అంగీకిరించింది.

ఎన్ఐఏ విచార‌ణ‌..కొత్త విష‌యాలు తెలుస్తాయా..

ఎన్ఐఏ విచార‌ణ‌..కొత్త విష‌యాలు తెలుస్తాయా..

విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌తో త‌మ‌కు ఏం సంబంధం అని ఏపి ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తోంది. దీంతో..ఈ కేసు ను ఎన్ఐఏ చ‌ట్టం ప్ర‌కారం ఎన్ఐఏ కు ఇవ్వాల‌ని..కేసులో ఆల‌స్య‌మైతే సాక్ష్యాధారాలు తారు మారు అయ్యే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టును అభ్య‌ర్ధించారు. ఇక‌, ఇప్పుడు కేసు ఎన్ఐఏ కు ఇవ్వ‌టంతో.. మొద‌టి నుండి ఈ కేసు పై తిరిగి విచార‌ణ ప్రారంభం కానుంది. విమానాశ్ర‌యంలో సిఐఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదు మేర‌కు ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభిస్తోంది. అయితే, ఈ విచార‌ణ‌లో ఏపి పోలీసులు తేల్చిన అంశాలే కాకుండా..కొత్త కోణం ఏమైనా ఎన్ఐఏ బ‌య‌ట పెడుతుందా అనే ఆస‌క్తి మొద‌లైంది. వైసిపి అధికారుల ఫిర్యాదుల పైనా ఎన్ఐఏ లోతుగా అధ్య‌య‌నం చేసే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్ కేసు ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టం పై టిడిపి నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

English summary
High Court Transfers Murder attempt on Jagan Case to NIA. On YCP advocate request court has taken this decision. Now NIA filed FIR and started Enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X