రోజాకు మరో ఛాన్స్?: టిఫిన్ చేయక, ఫుట్‌పాత్‌‍పై పడుకొని.. హైడ్రామా (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు ఇప్పటికే మూడుసార్లు డుమ్మా కొట్టిన వైసిపి ఎమ్మెల్యే రోజా, తాజాగా శనివారం కూడా గైర్హాజరయ్యారు. తనకు ఆరోగ్యం బాగా లేదని, అందుకే రాలేదని లేఖ రాశారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు బైఠాయించి, నీరసించిన ఆమె అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు.

దీంతో తాను రాలేకపోయానని లేఖ రాశారు. దీంతో, రోజాకు రెండు రోజుల తర్వాత మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రివిలేట్ కమిటీ భేటీ సమయంలో వైసిపి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కమిటీ నిరాకరించింది. ఇప్పటికీ మూడుసార్లు రాలేదని, ఇది నాలుగోసారని, ఇంకా ఎంతకాలం చూస్తామని సభ్యులు ప్రశ్నించారు.

విచారణ త్వరగా ముగించాలనుకంటున్నట్లు పేర్కొన్నారు. ఇంకా విచారణ పొడిగించే పరిస్థితి లేదని, సారీ అని కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు చెప్పారు. దీనిపై వైసిపి సభ్యులు లిఖితపూర్వకంగా అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే రోజా పైన చర్యలకు సభా హక్కుల కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. హక్కుల కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునే ముందు రోజాకు ఓ అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరోసారి పిలిస్తారని, అప్పటికీ రాకపోతే శాసన సభ తన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. వాస్తవానికి సభా హక్కుల నివేదిక కమిటీ కాలపరిమితి ఈ నెల 5వ తేదీతో ముగిసింది. కానీ వైసిపి ఎమ్మెల్యేలపై నివేదిక ఇచ్చిందుకు వీలుగా కాలపరిమితి పొడిగించారు.

రోజా

రోజా

ఏపీ అసెంబ్లీలో శుక్రవారంలాగే, శనివారం కూడా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైసిపి ఎమ్మెల్యే రోజా... సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పడంతో అసెంబ్లీకి హాజరయ్యేందుకు యత్నించారు.

రోజా

రోజా

ఆమెను గేటు వద్దే ఆమెను అడ్డగించారు. పోలీసుల వైఖరికి నిరసనగా రోజా గేటు వద్దే బయట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

రోజా

రోజా

తనను సభలోకి అనుమతించకపోవడంతో రోజా నడిరోడ్డుపై పడుకుండిపోయారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న రోడ్డుపై నిరసనకు దిగిన ఆమె, అక్కడే ఓ వస్త్రం పరుచుకుని పడుకుని తన నిరసన చేపట్టారు.

రోజా

రోజా

తనపై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు యత్నించిన ఆమెను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా ఆమె అక్కడే బైఠాయించారు.

 రోజా

రోజా

అనంతరం గేటుకు కాస్తంత దూరంగా రోడ్డుపై పేవ్‌మెంట్ మీద కూర్చున్న రోజా నిరసనను కొనసాగించారు. అసెంబ్లీకి హాజరుకావాలన్న భావనతో ఉదయం పూట హడావిడిగా వచ్చేసిన ఆమె అల్పాహారం కూడా తీసుకోలేదట. ఈ క్రమంలో గంటకు పైగా కూర్చున్న ఆమె నీరసించిపోయారు.

 రోజా

రోజా

దీంతో కూర్చునే ఓపిక లేక రోజా ఓ వస్త్రాన్ని తెప్పించుకుని అక్కడే పరుచుకుని దానిపై పడుకుండిపోయారు. వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆమెకు సహకారమందిస్తున్నారు. నీరసించినా దీక్షను మాత్రం వీడేది లేదంటూ రోజా పడుకునే నిరసన తెలిపారు.

రోజా

రోజా

గంటకు పైగా ఎండలో ఫుట్‌పాత్ పైన కూర్చున్న రోజా... నీరసించి అక్కడే వస్త్రాన్ని పరుచుకుని పడుకుండిపోయారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత వైసిపి అధినేత జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి రోజాను పరామర్శించారు.

రోజా

రోజా

ఆ తర్వాత జగన్ సూచనతో రోజా అంబులెన్స్ ఎక్కారు. తదనంతరం అంబులెన్స్ నేరుగా నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు రోజా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

రోజా

రోజా

ఇదిలా ఉంటే నీరసించిన రోజాను ఆసుపత్రికి పంపిన జగన్... తన ఎమ్మెల్యేలతో కలిసి అధికార పార్టీ వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు.

రోజా

రోజా

ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు ఇప్పటికే మూడుసార్లు డుమ్మా కొట్టిన వైసిపి ఎమ్మెల్యే రోజా, తాజాగా శనివారం కూడా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ.. ఆమెకు మరోసారి అవకాశమివ్వకపోయినా, ప్రభుత్వం ఇచ్చేందుకు ఆలోచిస్తోందని తెలుస్తోంది.

మీడియా పాయింట్

మీడియా పాయింట్

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండ ఉమ మాట్లాడారు. రోజా తీరును ఆయన తప్పుబట్టారు.

చెవిరెడ్డి

చెవిరెడ్డి

ఏపీ మీడియా పాయింట్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

గోరంట్ల

గోరంట్ల

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండ ఉమ విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

టిడిపి

టిడిపి

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత తదితరులు. వారు రోజాపై, వైసిపిపై మండిపడ్డారు.

పీతల సుజాత

పీతల సుజాత

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతున్న మంత్రి పీతల సుజాత.

రావెల కిషోర్ బాబు

రావెల కిషోర్ బాబు

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతున్న మంత్రి రావెల కిషోర్ బాబు.

అనిత

అనిత

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత తదితరులు. రోజాపై, వైసిపిపై మండిపడుతున్న ఎమ్మెల్యే అనిత.

అనిత

అనిత

ఏపీ మీడియా పాయింట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత తదితరులు. రోజాపై, వైసిపిపై మండిపడుతున్న ఎమ్మెల్యే అనిత. ప్రివిలేజ్ కమిటీ భేటీలో అనిత కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+