బద్వేల్ టిడిపిలో విభేదాలు: ఇద్దరు జడ్‌పిటిసిల రాజీనామా
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టిడిపిలో నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
కడప: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టిడిపిలో నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. అధికారపార్టీలో ఉన్నా కనీసం పెన్షన్ కూడ మంజూరు చేసుకోలేని పరిస్థితులో ఉన్నామని మనస్థాపంతో ఇద్దరు టిడిపి జడ్‌పిటిసి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా వ్యవహరం అధికార టిడిపిలో కలకలం రేపింది. బద్వేల్ జడ్‌పిటిసి సభ్యురాలు బి.శిరీష, గోపవరం జడ్‌పిటిసి సభ్యుడు ఎం. రమణయ్యలు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ రాజీనామా పత్రాలను టిడిపి అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు జడ్‌పిటిసి సభ్యులు రాజీనామా సమర్పించారు.
అధికార పార్టీలో జడ్పీటీసీలుగా ఉన్నా ఎంపీడీఓ కానీ, ఇతర స్థాయి అధికారులు తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

జడ్పీ నిధుల కింద రూ.12 లక్షల మేర పనులు చేసినప్పటికీ బిల్లులు రాకుండా చేస్తున్నార ని జడ్పీటీసీ శిరీష పేర్కొన్నారు. చిన్నవయసులోనే జడ్పీటీసీ పదవిని చేపట్టినప్పుడు ఎంతో ఆనందంగా ప్రజలకు సేవచేయాలని దృక్పథం ఉండేదని, కానీ ప్రజలకు ఏమీ చేయలేని స్థితిలో ఉండటంతో పదవిలో ఉన్నా, లేకున్నా ఒక్కటే అని భావించి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మధ్య ఉన్న విభేదాలే వీరి రాజీనామాకు కారణమని పలువురు చర్చిం చుకుంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలతోనే జడ్‌పిటిసిలు రాజీనామాలు సమర్పించారని ప్రచారం సాగుతోంది.
ఈ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే జయరాములు వెంటనే రాజీనామా సమర్పించిన ఇద్దరు జడ్‌పిటిసి సభ్యులతో స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో చర్చలు జరిపా రు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, ఇలా రాజీనామాలు చేయడం సరైన పద్ధతి కాదని వారికి తెలిపారు.వారితో చర్చలు జరిపానని రాజీనామాలను ఉపసంహరించుకుంటామని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.












Click it and Unblock the Notifications