రాజధానిపై హైపవర్ కమిటీ సమావేశం వాయిదా: 17 న ప్రభుత్వానికి నివేదిక: ఆ రెండు కమిటీలపైనా..!

రాజధానిపైన ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలి సమావేశం వాయిదా పడింది. ఇప్పటికే మూడు రాజధానుల ప్రతిపాదనల పైన ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ రెండూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఆ రెండు నివేదికల్లోనూ విశాఖను పరిపాలనా రాజధానిగా సిఫార్సు చేసారు. ఇప్పుడు ఈ రెండు కమిటీ నివేదికల పైనా అధ్యయనం కోసం పది మంది మంత్రులు..అధి కారులతో కలిపి ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి ఈ నెల 17వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని నిర్ధేశించినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వ హించి..మూడు రాజధానుల ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరులోగా అధికారిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైపవర్ కమిటీ సమావేశం వాయిదా..

ప్రభుత్వ రాజధానుల అంశం మీద వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే అందిన రెండు కమిటీ నివేదికల మీద అధ్యయనం చేసేందుకు నియమించిన హైపవర్ కమిటీ తొలి సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ సమావేశం ఈ నెల 6వ తేదీన సచివాలయంలో కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవటం తో ఈ తొలి సమావేశాన్ని 7వ తేదీకి వాయిదా వేసారు.

ఈ సమావేశం సచివాలయంలో నిర్వహించాలని భావించినా.. సీఆర్డీఏ కార్యాలయానికి వేదిక మార్చినట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో నెలకొన్న ఆందో ళనల కారణంగా సచివాలయం కంటే సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహణ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

High power committee on Capital shifting first meeting is post poned

17న ప్రభుత్వానికి కమిటీ నివేదిక...

ప్రభుత్వానికి అందిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ నివేదికల పైన అధ్యయనం చేసి హైపవర్ కమిటీ ఈ నెల 17న ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజధాని అంశం మీద రాజకీయంగా రగడ కొనసాగుతోంది. అదే సమయంలో అమరావతి ప్రాంతంలో ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో..సందిగ్దతకు ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నెల 17న సీఎం కు నివేదిక అందిస్తే..ఆ మరుసటి రోజున ఉదయం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయనుంది. ఆ వెంటనే అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఇప్పటికే ప్రభుత్వానికి అందిన బోస్టన్ నివేదిక పైన ఈ నెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలో రాజధాని రైతుల సమస్య పరిష్కరించే అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+